Salman Khan : బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌ని పక్కకి నెట్టేసిన సల్మాన్ బాడీగార్డ్స్.. వీడియో వైరల్!

సల్మాన్ ఖాన్ తన మాజీ ప్రియురాలు కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్‌తో ప్రవర్తించిన తీరు పై నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. బాడీగార్డ్స్ విక్కీ కౌశల్‌ని పక్కకి నెట్టేసి..

Vicky Kaushal : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతున్న IIFA 2023 అవార్డ్స్ కి హాజరయ్యాడు. ఆ ఈవెంట్ లో పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా సందడి చేశారు. అలాగే బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్‌ కూడా పాల్గొన్నాడు. అయితే విక్కీ కౌశల్‌ కి అక్కడ చేదు అనుభవం ఎదురైంది. URI సినిమాలో నటించిన విక్కీ కౌశల్‌.. ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డుని కూడా అందుకున్నాడు.

SSMB28 : టైటిల్‌కి ముహూర్తం ఫిక్స్ చేసిన మహేశ్.. ఈసారి మాస్ జాతర గ్యారంటీ!

ఇక ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina Kaif) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కత్రినా కైఫ్ ని బాలీవుడ్ లో పరిచయం చేయడమే కాకుండా తనకి స్టార్ స్టేటస్ ని తీసుకు వచ్చింది సల్మాన్ ఖానే. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కూడా జరిగిందని అప్పటిలో వార్తలు వచ్చాయి. కాగా ఇప్పుడు IIFA అవార్డ్స్ లో పాల్గొన్న విక్కీ కౌశల్ ఒక అభిమానికి సెల్ఫీ ఇస్తున్న సమయంలో సల్మాన్ ఖాన్ అటుగా నడుచుకుంటూ వచ్చాడు. ఇక దారి మధ్యలో ఉన్న కౌశల్ ని సల్మాన్ బాడీ గార్డ్స్ హీరో అని కూడా పక్కకి నెట్టేశారు.

Salaar : సలార్ నుంచి అప్డేట్.. ఆమె పాత్ర షూటింగ్ పూర్తి.. టీజర్ అప్పుడే వస్తుందా?

కౌశల్ సీరియస్ అవ్వకుండా సల్మాన్ తో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, మాట్లాడడానికి ట్రై చేశాడు. కానీ సల్మాన్ తిరిగి షేక్ హ్యాండ్ ఇవ్వడం కాదు కనీసం సరిగా మాట్లాడాను లేదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసిన నెటిజెన్స్ సల్మాన్ అండ్ అతడి బాడీ గార్డ్స్ నిందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా సల్మాన్ కి ఇటీవల గ్యాంగ్ స్టార్ నుంచి బెదిరింపు ఇమెయిల్స్ రావడంతో.. తన సెక్యూరిటీని ఇంకొంచెం మెరుగు పరుచుకున్న సంగతి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు