SSMB28 : టైటిల్‌కి ముహూర్తం ఫిక్స్ చేసిన మహేశ్.. ఈసారి మాస్ జాతర గ్యారంటీ!
మహేష్ బాబు SSMB28 నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మాస్ జాతర చేయడానికి టైటిల్ ని థియేటర్స్ లో గ్రాండ్ గా..

SSMB28 title released on krishna birthday with Mosagallaku Mosagadu re release
Mahesh Babu SSMB28 : సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం SSMB28. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ఆగష్టుకే సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తాను అంటూ మాట ఇచ్చిన మేకర్స్.. పోస్ట్‌పోన్ చేసి వచ్చే ఏడాది జనవరికి తీసుకు వెళ్లడంతో అభిమానులు కొంచెం నిరాశ చెందారు. దీంతో వారిని కొంచెం ఉత్సాహపరిచేందుకు మూవీ టైటిల్ ని అనౌన్స్ చేయబోతున్నారు. కృష్ణ పుట్టినరోజు నాడు మహేష్ తన సినిమాల అప్డేట్ ఇస్తుంటాడు అనే విషయం గురించి అందరికి తెలిసిందే.
ఇక ఈ నెల 31న కృష్ణ బర్త్ డే రోజున SSMB28 టైటిల్ ని రివీల్ చేయబోతున్నాడు. ఆ రోజున కృష్ణ సూపర్ హిట్ మూవీ మోసగాళ్లకు మోసగాడు సినిమా రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాతో పాటు బిగ్ స్క్రీన్ పై SSMB28 టైటిల్ ని అనౌన్స్ చేయబోతున్నారు. అయితే ఇది గ్లింప్స్ రూపంలో అనౌన్స్ చేస్తారా? మోషన్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేస్తారా? అనేది తెలియజేయలేదు. కాగా ఈ మూవీ టైటిల్ గురించి సోషల్ మీడియాలో అనేక పేరులు వినిపిస్తున్నాయి.
Salaar : సలార్ నుంచి అప్డేట్.. ఆమె పాత్ర షూటింగ్ పూర్తి.. టీజర్ అప్పుడే వస్తుందా?
ఈ సినిమాకి ముందు నుంచి ‘అమరావతికి అటు ఇటు’ అనే టైటిల్ గట్టిగా వినిపిస్తూ వచ్చింది. ఇక ఇటీవల ఈ టైటిల్ తో పాటు ‘గుంటూరు కారం’, ‘ఊరిలో మొనగాడు’ పేరులు కూడా వినిపించాయి. మరి వీటిలో ఏది ఫైనల్ అవుతుందో చూడాలి. చిత్ర యూనిట్ మాత్రం 31న మాస్ జాతర చూస్తారు అంటూ ట్వీట్ చేసి అంచనాలు పెంచేస్తున్నారు. కాగా ఈ సినిమాలో పూజా హెగ్డే (Pooja Hegde), శ్రీలీల (Sreeleela) హీరోయిన్లుగా నటిస్తున్నారు. గుంటూరు బ్యాక్ డ్రాప్ తో ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది.
A Smashing ???? Euphoria is all set to begin!! ?#SSMB28 Title will be revealed by all of you, SUPER FANS at ???????? near you on ???? ??? in a Never before way! ?
Stay tuned for more exciting updates ?
Super ? @urstrulyMahesh #Trivikram @hegdepooja… pic.twitter.com/m0u41bGfGn
— Haarika & Hassine Creations (@haarikahassine) May 26, 2023