Salman Khan : చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న సల్లూ భాయ్..
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ క్యామియో మాత్రం కన్ఫమ్ అయిపోయిందని అంటున్నారు.. చిరుతో కలిసి కాసేపు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట సల్లూ భాయ్..
- sekhar
- Updated on- August 18, 2021 / 05:36 PM IST
Salman
Salman Khan: మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. ‘ఆచార్య’ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉండగానే మలయాళ ‘లూసీఫర్’ తెలుగు రీమేక్ పట్టాలెక్కించేశారు. మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూట్ హైదరాబాద్, అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆగస్టు 13న స్టార్ట్ అయ్యింది. చిరు పైన జైల్ సీన్స్ పిక్చరైజ్ చేస్తున్నారు.
చిరు ఇమేజ్, తెలుగు నేటివిటీకి తగ్గట్లు స్క్రిప్ట్‌లో ఛేంజెస్ చేశారు డైరెక్టర్ మోహన్ రాజా. ‘గాడ్ ఫాదర్’ అనే సాలిడ్ టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. కథానాయికతో సహా కీలకమైన హీరో సిస్టర్ క్యారెక్టర్‌కి సంబంధించిన నటీనటుల ఎంపిక ఇంకా పూర్తవలేదు.
అయితే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ క్యామియో మాత్రం కన్ఫమ్ అయిపోయిందని అంటున్నారు. చిరుతో కలిసి కాసేపు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట సల్లూ భాయ్. చిరు – సల్మాన్ మధ్య మంచి రిలేషన్ ఉంది. రామ్ చరణ్ షూటింగ్ కోసం బాంబే వెళ్తే సల్మాన్ ఇంటినుండి క్యారేజ్ వెళ్లేది. అలాగే సల్మాన్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మెగాస్టార్ హౌస్‌ను విజిట్ చెయ్యాల్సిందే.
Blood Brothers : కరోనా బాధిత ‘బ్లడ్ బ్రదర్స్’ కుటుంబాలకు అండగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి..
చిరు 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో సల్లూ భాయ్ స్టెప్స్ హైలెట్ అయ్యాయి. మెగా కోడలు ఉపాసన మ్యాగజైన్‌కి స్పెషల్ ఇంటర్వూ కూడా ఇచ్చారు సల్మాన్. ‘లూసీఫర్’ రీమేక్‌లో గెస్ట్ అప్పీరియెన్స్ ఇవ్వమని అడగ్గా సల్మాన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని, చిరుతో కలిసి ఆయన స్క్రీన్ మీద కనిపించే కాసేపు థియేటర్లు హోరెత్తుతాయని అంటున్నారు మూవీ టీం.
