Salman Khan : ఈ పోస్ట్ తో తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చినట్టేనా..? సల్మాన్ ఖాన్ పోస్ట్ వైరల్..
తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలకు సల్మాన్ ఖాన్ చెక్ పెట్టాడు. (Salman Khan)
- Saketh U
- Published on- July 20, 2026 / 03:39 PM IST
Salman Khan
Salman Khan : ఇటీవల బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ముంబైలో ఓ కార్యక్రమంలో కనిపించగా ఆయన లుక్స్ వైరల్ గా మారాయి. క్లీన్ షేవ్ తో, అలిసిపోయిన ఫేస్ తో, బరువు తగ్గినట్టు, నీరసంగా ఉన్నట్టు కనిపించారు. దీంతో సల్మాన్ ఖాన్ కి ఏమైంది? ఆయన ఆరోగ్యం బాగానే ఉందా అని అభిమానులు ఆందోళన చెందారు. ఆయన ఆరోగ్యంపై కూడా పలు వార్తలు వచ్చాయి.
అయితే తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలకు సల్మాన్ ఖాన్ చెక్ పెట్టాడు. నేడు తన సోషల్ మీడియాలో స్టైలిష్ లుక్స్ లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను షేర్ చేసారు. కౌబోయ్ టోపీ కూడా పెట్టుకొని పోజులు ఇచ్చారు. ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. మీ అందరి ఆరోగ్యం ఎలా ఉంది..? అని రాసుకొచ్చారు. దీంతో తన ఆరోగ్యం పై వచ్చిన వార్తలు, రూమర్స్ కి ఈ ఫొటోలతో, ఈ పోస్ట్ తో కౌంటర్ ఇచ్చినట్టు, తాను బాగానే ఉన్నాను అని ఇండైరెక్ట్ గా చెప్పినట్టు తెలుస్తుంది.
Also Read : Akkineni Heros : ఒకే వేదికపైకి ముగ్గురు అక్కినేని హీరోలు.. లెనిన్ బ్లాక్ బస్టర్ వైభవం.. కానీ..
