పెళ్ళీ, గిల్లీ జాన్తానయ్.. నాకు బచ్ఛా ఔర్ బచ్ఛీ కావాలి అని సరోగసీ ద్వారా బిడ్డని కనే ఏర్పాటులో ఉన్నాడట.. బాలీవుడ్ కండల వీరుడు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్..
బాలీవుడ్ కండల వీరుడు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. సల్మాన్ ఖాన్ పెళ్ళి గురించి ఏళ్ళ తరబడి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. హీరోయిన్లతో ఎఫైర్లు, సహజీవనాల ఉదంతాలు బోలెడున్నాయి భాయ్ ఖాతాలో.. బాలీవుడ్‌లో రీసెంట్‌గా సల్మాన్ ఖాన్ గురించి ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే, సల్మాన్ తండ్రి కాబోతున్నాడట.. ముందు పెళ్ళి, పెళ్ళాం సంగతి చెప్పకుండా డైరెక్ట్‌గా తండ్రి కాబోతున్నాడు అంటున్నారేంటి అనుకుంటున్నారా?.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్..
సల్లూ భాయ్ ఎవర్నీ మ్యారేజ్ చేసుకోవడం లేదు.. కానీ, బిడ్డకు తండ్రి అవ్వాలనుకుంటున్నాడు.. ఎస్, మీరు చదివింది నిజమే.. అందరిలా ఆలోచిస్తే ఆయన సల్మాన్ ఎందుకవుతాడు.. అందుకే పెళ్ళీ, గిల్లీ జాన్తానయ్.. నాకు బచ్ఛా ఔర్ బచ్ఛీ కావాలి అని సరోగసీ ద్వారా బిడ్డని కనే ఏర్పాటులో ఉన్నాడట.. ఇప్పటి వరకు షారుక్ ఖాన్, కరణ్ జోహార్, ఏక్తా కపూర్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీలు సరోగసీ పద్ధతిలోనే సక్సెస్ ఫుల్‌గా పిల్లల్ని కన్నారు.
టాలీవుడ్‌లో మంచి లక్ష్మీ కూడా సరోగసీ ద్వారానే ఓ బిడ్డను కన్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా ఇదే పద్ధతిలో త్వరలో పండంటి బిడ్డను తమ ఖాన్ ఖాందాన్‌లోకి తీసుకురాబోతున్నట్టు బాలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి..