Salman Khan : చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. సల్మాన్ ఖాన్ ప్రెస్ నోట్.. అసలు ఏమైంది..!
సల్మాన్ ఖాన్ ఒక సీరియస్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. అలా చేస్తున్న వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
- gum 95921
- Published On : July 17, 2023 / 05:58 PM IST
Salman Khan released press note about fake id of Salman Khan Films
Salman Khan : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. దానిలో వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ పేర్కొన్నాడు. అసలు ఏమైందని ఆలోచిస్తున్నారా..? సల్మాన్ నటుడి గానే కాదు ‘సల్మాన్‌ఖాన్ ఫిల్మ్స్’ అనే ప్రొడక్షన్ హౌస్ పెట్టి నిర్మాతగా కూడా పలు సినిమాలు చేశాడు. ఇటీవల వచ్చిన ‘కిసీకా భాయ్ కిసీకా జాన్’ చిత్రం కూడా ఆ ప్రొడక్షన్ లో వచ్చిందే. అయితే సల్మాన్ నిర్మించబోతున్న కొత్త సినిమాలోని నటీనటులకు ఎంపిక జరుగుతుందని, ఆసక్తి ఉంటే సంప్రదించండి అంటూ కొందరికి ఇమెయిల్స్ వెళ్లాయి.
అసలు విషయం ఏంటంటే ఆ ఇమెయిల్స్ సల్మాన్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వెళ్ళినవి కావు. సల్మాన్ ప్రొడక్షన్ పేరుతో ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి అవకాశం ఎదురు చూస్తున్నవారికి మెయిల్స్ పంపించి కొందరు మోసానికి పాల్పడుతున్నారు. ఈ విషయం సల్మాన్ వరకు వెళ్లడంతో.. ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. తాము ఎటువంటి ఎంపికలు చేయడం లేదని, ఇప్పుడు గాని భవిష్యత్ ప్రాజెక్ట్ ల కోసం గాని మేము ఎటువంటి క్యాస్టింగ్ ఏజెంట్స్‌ను నియమించలేదని, కాబట్టి మీకు వచ్చే ఇమెయిల్స్ ని నమ్మొద్దు అంటూ తెలియజేశాడు.
Raviteja – Baby : బేబీ మూవీకి రవితేజ ప్రశంసలు.. ఏమి అన్నాడంటే..!
Official Notice! pic.twitter.com/uIvAQgYbwl
— Salman Khan (@BeingSalmanKhan) July 17, 2023
అలాగే ఈ మోసానికి పాల్పడుతున్న వారికి కూడా వార్నింగ్ ఇచ్చాడు. తన పేరుని ఇలా తప్పుగా వాడుతున్న వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ వెల్లడించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక సల్మాన్ నటిస్తున్న సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం టైగర్ 3 (Tiger 3) సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కత్రినా కైఫ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. షారుఖ్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించబోతున్నాడు. నవంబర్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
