Salman Khan : ఇక తన లైఫ్‌లో పెళ్లి చాప్టర్ లేదని చెప్పేసిన సల్మాన్.. వీడియో వైరల్!

సల్మాన్ ఖాన్ పెళ్లి కోసం అందరూ ఎదురు చూస్తుంటే.. తనేమో ఇక తన లైఫ్‌లో పెళ్లి చాప్టరే లేదని చెప్పి అందర్నీ షాక్ కి గురి చేశాడు. దుబాయ్ లో IIFA 2023 అవార్డ్స్ లో పాల్గొన్న సల్మాన్..

Salman Khan : బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. 57 ఏళ్ళ సల్మాన్ ఖాన్ పెళ్లి కోసం అభిమానులతో పాటు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ప్రభాస్, విశాల్ వంటి హీరోలు కూడా సల్మాన్ ఖాన్ తరువాత పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు వారందరికీ షాక్ ఇస్తూ తాను ఇక పెళ్లి చేసుకోబోయేది లేదని తేల్చి చెప్పేశాడు. ప్రస్తుతం దుబాయ్ లో IIFA 2023 అవార్డ్స్ ఫంక్షన్ జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇక ఆ ఫంక్షన్ కి సల్మాన్ తన సోదరి అర్పిత ఖాన్ (Arpita Khan) కుటుంబంతో కలిసి హాజరయ్యాడు. దుబాయ్ హోటల్ లో తన సోదరి పిల్లలతో కలిసి సరదాగా ఆడుకుంటున్న వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు. అలాగే అవార్డు ఫంక్షన్ లో తన సోదరితో కలిసి ఉన్న ఒక వీడియోని కూడా షేర్ చేశాడు. ఆ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే, ఈ అవార్డు వేడుకల్లో రెడ్ కార్పెట్ స్టార్స్ ని మీడియా రిపోర్టర్స్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సల్మాన్ తో కూడా ఇంటరాక్ట్ అయ్యారు.

ఇక ఆ ఇంటరాక్షన్ లో ఒక లేడీ రిపోర్టర్ మాట్లాడుతూ.. “నేను మిమ్మల్ని కలవడానికి హాలీవుడ్ నుంచి వచ్చాను. మిమ్మల్ని చూడగానే నేను ప్రేమలో పడిపోయాను. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?” అని ప్రశ్నించింది. దీనికి సల్మాన్ ఖాన్ బదులిస్తూ.. “లేదు, నా లైఫ్ లో పెళ్లి చేసుకునే రోజులు ఇక అయ్యిపోయాయి. మీరు నన్ను ఒక 20 ఏళ్ళ క్రిందట కలిసి ఉండాల్సింది” అంటూ చెప్పుకొచ్చాడు. సల్మాన్ ఖాన్ పెళ్లి కోసం అందరూ ఎదురు చూస్తుంటే.. తనేమో ఇక తన లైఫ్‌లో పెళ్లి చాప్టరే లేదని చెప్పడం అందర్నీ షాక్ కి గురి చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ట్రెండింగ్ వార్తలు