Samantha Supports to Sara and Rakul Preet: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అక్కినేని.. బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ మరియు రకుల్ ప్రీత్ సింగ్‌లకు సపోర్ట్ చేశారు. వివరాళ్లోకి వెళ్తే.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్ కోణం బయట పడటంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగి అతని మాజీ ప్రేయసి రియా చక్రవర్తిని, ఆమె సోదరుడు షౌవిక్ చక్రవర్తితో సహా మరికొందరిని అరెస్ట్ చేసింది.
ఈ వ్యవహారంలో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేర్లను రియా వెల్లడించినట్లు వార్తలు వైరల్ అవడంతో కొంతమంది నెటిజన్స్ అత్యుత్సాహంతో సారా, రకుల్‌లపై తమదైన రీతిలో కామెంట్స్ చేశారు. విషయం దావానంలో వ్యాపించడంతో ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా ఈ విషయంపై స్పందించారు..
https://10tv.in/kangana-ranaut-makes-explosive-revelation-on-rampant-use-of-drug-in-bollywood/
‘‘మాదక ద్రవ్యాల సరఫరా చేసే గ్రూప్ వివరాలను సేకరించాం. కానీ బాలీవుడ్ ప్రముఖుల జాబితాను మేం సిద్ధం చేసుకోలేదు. అయితే అందరూ దాన్ని బాలీవుడ్ ప్రముఖుల లిస్టుగా అపార్థం చేసుకున్నారు’’ అన్నారు. డ్రగ్స్ వ్యవహారంతో సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ పేర్లు లేవని తెలియడంతో నెటిజన్స్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్‌సింగ్‌లకు క్షమాపణలు చెబుతున్నారు..
ఈ నేపథ్యంలో కొందరు వారిని విమర్శిస్తూ చేసిన పోస్ట్‌లను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసి.. #SorrySara #SorryRakul అనే హ్యాష్ ట్యాగ్లతో సారా అలీఖాన్, రకుల్ ప్రీత్‌సింగ్‌లకు తన సపోర్ట్ తెలిపారు సమంత.. దీంతో పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు సమంతను అభినందిస్తున్నారు..