Samantha : మయోసైటిస్ చికిత్స కోసం స్టెరాయిడ్స్.. అందుకే సమంత ఫేస్ ఇంతలా మారిపోయిందా?
తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు మాట్లాడుతూ వీడియోల రూపంలో సమాధానమిచ్చింది సమంత.
- Saketh U
- Published On : September 20, 2023 / 09:51 AM IST
Samantha Face Changing due to Myositis Treatment samantha photos and videos goes viral
Samantha : సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి మాయోసైటిస్(Myositis) చికిత్స కోసం అమెరికా(America)కు వెళ్లిన సంగతి తెలిసిందే. అమెరికాలోనే కొన్ని నెలల పాటు ఉండి పూర్తిగా మాయోసైటిస్ నయమయ్యే వరకు చికిత్స తీసుకొని, కోలుకొని పూర్తి ఆరోగ్యంతో ఇండియాకు తిరిగి రావాలని సమంత డిసైడ్ అయింది. అమెరికాలో ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది సమంత. ఇటీవల రెగ్యులర్ గా పోస్టులు, తన జిమ్(Gym)ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుంది.
ఇటీవల జిమ్ నుంచి ఓ ఫోటో పోస్ట్ చేసింది సామ్. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు మాట్లాడుతూ వీడియోల రూపంలో సమాధానమిచ్చింది సమంత. ఆ ఫోటో, ఈ వీడియోల్లో సమంతని చూసి ఇంతలా మారిపోయింది ఏంటి? ఫేస్ లో చాలా చేంజ్ వచ్చింది ఏంటి అని అంతా భావిస్తున్నారు. అయితే ఓ అభిమాని మీ ఫేస్ లో గ్లో వచ్చింది ఏంటి అని అడిగిన ప్రశ్నకి సమంత సమాధానమిచ్చింది.
Akkineni Nageswara Rao : వంద సంవత్సరాల అక్కినేని అందగాడు.. నేటి నుంచి శత జయంతి ఉత్సవాలు ప్రారంభం..
సమంత సమాధానమిస్తూ.. మీరు అనుకున్నట్టు ఏమి లేదు. మాయోసైటిస్ చికిత్సలో భాగంగా చాలా స్టెరాయిడ్స్ తీసుకున్నాను. స్టెరాయిడ్స్ షాట్స్ తీసుకుంటున్నాను. దాంతో కొంచెం చర్మ సంబంధ సమస్యలతో ఇబ్బందిపడ్డాను. ఫేస్ లో చేంజ్ వచ్చింది. చిన్మయి నన్ను గ్లాసీగా తయారుచేస్తానని చెప్పింది, చూడాలి మరి అని తెలిపింది. దీంతో చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ వాడుతున్నందుకే సమంత ఫేస్ ఇలా తయారవుతుందా అని నెటిజన్లు, అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
