Samantha Hair Stylist emotional post on her treatment
Samantha : స్టార్ హీరోయిన్ సమంత గత కొంత కాలంగా మయోసైటిస్ (Myositis) అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్న విషయం తెలిసిందే. గతంలో ఆరు నెలలు గ్యాప్ తీసుకోని చికిత్స తీసుకున్నప్పటికీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో ఇప్పుడు ఒక ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి సమంత అమెరికాకు చికిత్స కోసం వెళ్లబోతుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని ఆమె హెయిర్ స్టైలిష్ట్ కన్ఫర్మ్ చేశాడు. తన సోషల్ మీడియాలో సమంత గురించి ఎమోషనల్ పోస్ట్ వేశాడు.
Janhvi Kapoor : అమ్మ చనిపోయినప్పుడు.. పెద్ద యుద్ధమే చేశా : జాన్వీకపూర్
“ఈ రెండేళ్లలో ఒక సెన్సషనల్ మ్యూజిక్ వీడియో, మూడు సినిమాలు, ఏడు బ్రాండ్ క్యాంపెయిన్స్, రెండు ఎడిటోరియల్స్, ఇంకా లైఫ్ టైం టైం గుర్తుండిపోయే మెమోరీస్. ఎండ వాన లేకుండా వర్క్ చేశాం. ఎన్నో నవ్వులు, సంతోషాలు, కన్నీళ్లు, బాధలు.. అన్నిటిని నవ్వుతు స్వీకరించాం. ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలని చూశాం. అదంతా ఒక బ్యూటిఫుల్ జర్నీ. ఇప్పుడు మీరు చికిత్స కోసం వెళ్తున్నారు. నాకు నమ్మకం ఉంది. మీరు మునుపటికంటే ఎక్కువ శక్తితో తిరిగి వస్తారని. మిమ్మల్ని మళ్ళీ కలిసే రోజు కోసం నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటా” అంటూ రాసుకొచ్చాడు.
Upasana : మెగా ప్రిన్సెస్ కోసం స్పెషల్ రూమ్‌ని డిజైన్ చేయించిన ఉపాసన.. వీడియో వైరల్!
ఈ పోస్ట్ తో సామ్ చికిత్స కోసం వెళ్లబోతుందని అర్ధమైంది. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు.. సమంత పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కామెంట్స్ చేస్తున్నారు. కాగా సమంత ఖుషి (Kushi) అండ్ సిటాడెల్ (Citadel) లో నటిస్తుంది. ఈ రెండిటి షూటింగ్స్ ని రీసెంట్ గా పూర్తి చేసేసింది సమంత. ఖుషి సినిమా విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతుంది. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతుంది. ఇక సిటాడెల్ వెబ్ సిరీస్ రిలీజ్ గురించి మేకర్స్ నుంచి క్లారిటీ రావాలి.