Samantha happy time with Chinmayi Sripaada Rahul Ravindran kids
Samantha : మయోసైటిస్ (Myositis) వ్యాధితో బాధపడుతున్న సమంత ఇటీవల సినిమాలకు ఒక సంవత్సరం పాటు బ్రేక్ ఇచ్చి ట్రీట్మెంట్ కోసం వెళ్లినట్లు అందరికి తెలిసిందే. ఇక ఆ చికిత్స తీసుకుంటూనే హ్యాపీ టూర్స్ వేస్తూ మెంటల్ గా కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఈ క్రమంలోనే కోయంబత్తూర్, బాలి వంటి ప్రదేశాల్లో ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా ఇద్దరి పిల్లలతో ఆడుకుంటున్న వీడియో ఒకటి సమంత షేర్ చేసింది.
Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’ వాయిదా..? దర్శకుడు నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే..?
ఆ వీడియోలో సమంత చిన్నపిల్లలా వాళ్లతో కలిసి అల్లరి చేస్తూ సరదాగా కనిపిస్తుంది. ఈ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఆ పిల్లలు టాలీవుడ్ లోని ఒక సెలబ్రెటీ కిడ్స్ అని మీకు తెలుసా..? సమంత కెరీర్ స్టార్టింగ్ తనకి తన గొంతుని ఇచ్చి సామ్ ని టాలీవుడ్ ఆడియన్స్ కి మరింత దగ్గర చేసింది.. సింగర్ మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి. సమంత అండ్ చిన్మయి ఇద్దరు మంచి స్నేహితులు. చిన్మయి ప్రముఖ టాలీవుడ్ యాక్టర్ రాహుల్ రవీంద్రన్ ప్రేమ వివాహం చేసుకుంది.
Samantha : మయోసైటిస్ చికిత్స కోసం 25 కోట్లు ఖర్చుపెడుతున్న సమంత.. నిజమేనా..?
గత ఏడాది చిన్మయి ఇద్దరు కవలలకు జన్మనించింది. బాలి వెకేషన్ నుంచి వచ్చిన సమంత.. ప్రస్తుతం చిన్మయి ఇంటిలోనే ఉంటూ వారి పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తుంది. సమంత షేర్ చేసిన ఒక వీడియోలో.. ఇద్దరి పిల్లలతో కలిసి కుర్చితో ఆడుకుంటూ కనిపిస్తుంది. ఆ వీడియోకి సామ్ ఇలా రాసుకొచ్చింది.. “చిన్మయి అండ్ రాహుల్ ని కిడ్నప్ చేయడానికి నాకు సరైన దారి దొరికింది” అంటూ పిల్లల్ని ఉదేశిస్తూ పేర్కొంది. మరో వీడియోలో నాటు నాటు సాంగ్ కి బుడ్డోడుతో కలిసి స్టెప్ వేస్తూ కనిపించింది.
Always a Child 🤍🥹
Our Cutie @Samanthaprabhu2 with @Chinmayi & @23_rahulr kids ❤️🫶#Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/itrPdoB1H7— SAM ARMY || KnowUrStarSAM™ (@KnowUrStarSAM) August 6, 2023