Maa Inti Bangaram First Review : ‘మా ఇంటి బంగారం’ ఫస్ట్ రివ్యూ.. సమంత సినిమా టాక్ ఏంటి?

Maa Inti Bangaram First Review: ఇప్పటికే టాలీవుడ్ లో మా ఇంటి బంగారం సినిమా స్పెషల్ షో వేశారని సమాచారం. అలాగే సెన్సార్ కూడా పూర్తయింది.

  • Updated on- June 18, 2026 / 11:57 AM IST

Samantha Maa Inti Bangaram First Review

Maa Inti Bangaram: సమంత చాలా గ్యాప్ తర్వాత మెయిన్ లీడ్ లో మా ఇంటి బంగారం అనే సినిమాతో జూన్ 19న థియేటర్స్ లోకి రానుంది. సమంత సొంత నిర్మాణంలో రాజ్ నిడిమోరు అందించిన కథతో నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. ట్రైలర్ లో సమంత యాక్షన్ సీక్వెన్స్ లతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొల్పారు. ఇప్పటికే టాలీవుడ్ లో మా ఇంటి బంగారం సినిమా స్పెషల్ షో వేశారని సమాచారం. అలాగే సెన్సార్ కూడా పూర్తయింది. ఈ సినిమా నిడివి 2 గంటల 34 నిముషాలు.

సినిమా విషయానికొస్తే.. సమంత పెళ్లి చేసుకొని ఓ గ్రామంలోని సాంప్రదాయ కుటుంబానికి వస్తుంది. లవ్ మ్యారేజ్ కావడంతో అక్కడ ఫ్యామిలీ అంతా సమంతని కొత్తగా చూడటం, ఆమె ఇంటి కోడలు అంటే అన్ని పనులు చేయాలని చెప్పడం. శ్రీముఖి – సమంత మధ్య సీన్స్, ఫ్యామిలీ సీన్స్ తో సింపుల్ గా అక్కడక్కడా కామెడీతో సాగుతుంది. ఇంటర్వెల్ సమయానికి తన గతం తాలూకు వ్యక్తులు రావడం సమంతని ఇబ్బంది పెట్టడంతో ఓ యాక్షన్ సీక్వెన్స్ తో అసలు సమంత ఎవరు? సమంత బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ లో సమంత ఓ దళంలో పనిచేసినట్టు, అసలు దళంలోకి ఎందుకు వెళ్ళింది, గన్ ఎందుకు పట్టుకుంది? గుల్షన్ దేవయ్య ఎలా పరిచయం అయ్యాడు? ఎందుకు ఆ దళం వదిలేసి వచ్చింది? మళ్ళీ గుల్షన్ దేవయ్య సమంత లైఫ్ లోకి వస్తే ఏం చేసింది? సమంత గురించి తెలిసి భర్త కుటుంబం వాళ్ళు ఏం చేసారు అని ఆసక్తిగా సాగుతుంది.

Also Read – Anil Ravipudi : మొదలైన అనిల్ రావిపూడి సినిమా.. సంక్రాంతికి రెడీ అవ్వండి..

ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యామిలీ స్టోరీ, అక్కడక్కడా కామెడీ, కొంత సాగదీతతో నడిపించి ఇంటర్వెల్ కి భాషా రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు హైప్ ఇచ్చారట. సెకండ్ హాఫ్ మాత్రం బోర్ కొట్టకుండా యాక్షన్ సీక్వెన్స్, ఫ్లాష్ బ్యాక్ లతో, ఓ ట్విస్ట్ తో సాగుతుందట. ఈ సినిమాకు సెకండ్ హాఫ్ బాగా ప్లస్ అయిందని టాక్. సమంత అయితే యాక్షన్ సీక్వెన్స్ లతో అదరగొట్టేసింది అని అంటున్నారు. సమంత ఫ్యాన్స్ కి అయితే పండగే. శ్రీముఖి కోడలి పాత్ర కూడా బాగుంటుంది. నవ్విస్తుంది, మెప్పిస్తుంది. గుల్షన్ దేవయ్య నెగిటివ్ షేడ్స్ పాత్ర అని తెలుస్తుంది.

ప్రమోషన్స్ లో నందిని రెడ్డి చెప్పినట్టు బాషా, కలిసుందాం రా సినిమాలు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఈ మా ఇంటి బంగారం సినిమా అలాగే ఉంటుందట. ఫస్ట్ హాఫ్ ఫ్యామిలీ మోడ్, ఇంటర్వెల్ నుంచి యాక్షన్ మోడ్. సినిమాటోగ్రఫీ విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ అయితే అదిరిపోయాయి అని తెలుస్తుంది. ఆల్రెడీ ఓ పాట హిట్ అయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టేశారట. సమంత చాన్నాళ్ల తర్వాత మళ్ళీ హిట్ కొడుతుందని టాలీవుడ్ టాక్.