Samantha-Naga Chaitanya: విలన్ షేడ్స్ చూపిస్తున్న చై-సామ్!
సమంత.. నాగచైతన్య ఇద్దరూ ఇద్దరే.. ఎవ్వరూ తక్కువ కాదు. మొన్నటి వరకూ మంచిగా కామ్ గా కనిపించిన ఈ భార్యా భర్తలు ఇప్పుడిప్పుడే తమలోని విలన్ షేడ్స్ ని చూపిస్తున్నారు.
- Naresh Mannam
- Published On : September 24, 2021 / 10:32 AM IST
Samantha Naga Chaitanya
Samantha-Naga Chaitanya: సమంత.. నాగచైతన్య ఇద్దరూ ఇద్దరే.. ఎవ్వరూ తక్కువ కాదు. మొన్నటి వరకూ మంచిగా కామ్ గా కనిపించిన ఈ భార్యా భర్తలు ఇప్పుడిప్పుడే తమలోని విలన్ షేడ్స్ ని చూపిస్తున్నారు. ఈ విషయంలో ఫస్ట్ సమంత నెగెటివ్ షేడ్ చూపిస్తే.. ఇప్పుడు నాగచైతన్య కూడా నేనేం తక్కువా అంటూ విలన్ గా మారిపోతున్నారు.
Chai – Sam : అందరి కళ్లూ ఆ డేట్ మీదే.. ఎందుకలా..?
ఈ భార్యా భర్తలిద్దరూ.. ఇంత సాఫ్ట్ గా, క్యూట్ గా కనిపిస్తున్నారు. కానీ ఇద్దరూ ఇద్దరే. టైమ్ రావాలే కానీ తమలోని విలనిజాన్ని, నెగెవిటీని చూపిస్తున్నారు నాగచైతన్య, సమంత. ఈమధ్యకాలంలో సమంత విలనిజం చూపించి సర్ ప్రైజ్ చేస్తే.. నాగచైతన్య కూడా అదే విలనిజంతో ఆడియన్స్ ని ఇంకా భయపెట్టడానికి రెడీ అయ్యారు.
Evaru Meelo Koteeswarulu: హీరోలంతా ఒక్కటే.. అందరినీ గేదర్ చేస్తున్న తారక్!
నాగచైతన్య ఇప్పటి వరకూ పెద్దగా నెగెటివ్ షేడ్ విలనిజం చూపించలేదు. కానీ సమంత విలనిజం చూసి ఇంప్రెస్ అయ్యారో ఏమో.. నాగచైతన్య కూడా నెగెటివ్ రోల్ చేస్తున్నారు. విక్రమ్ కుమార్ డైరెక్షన్లో ఓటీటీ యాప్ అమెజాన్ లో రాబోతున్న ఓ హార్రర్ యాక్షన్ సిరీస్ లో విలన్ గా చేస్తున్నానని అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కి షాకిచ్చారు.
Samantha Akkineni: సమంతకు సొంత బిడ్డలైన హ్యాష్, సాషా..!
సమంత, నాగచైతన్యల్లో ఫస్ట్ విలనిజాన్ని చూపించింది సమంత. అప్పటి వరకూ క్యూట్ గా, సాఫ్ట్ గా హీరోయిన్ గా ముద్దుముద్దుగా కనిపించిన సమంత.. సడెన్ గా విలన్ గా మారిపోయింది. ఫ్యామిలీ మ్యాన్ 2 సినిమాలో నెగెటివ్ రోల్ లో అందరినీ సర్ ప్రైజ్ చేసింది సమంత. పెద్దగా డైలాగులు లేకపోయినా.. సింపుల్ గా ఎక్స్ ప్రెషన్స్ తోనే విలన్ గా మంచి మార్కులుకొట్టేసింది.
