Samantha : ఒంటరిగా జీవించడం అరుదైన బహుమతి.. అవకాశం వస్తే వదులుకోకండి.. సమంత పోస్ట్ వైరల్..!
మయోసైటిస్ వ్యాధితో బాధ పడుతున్న సమంత తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో ఒక పోస్ట్ షేర్ చేసింది. ఒంటరిగా జీవించడం అరుదైన బహుమతి, అవకాశం వస్తే వదులుకోకండి అంటూ..
- gum 95921
- Published On : August 23, 2023 / 07:58 PM IST
Samantha shares Loneliness quote in her instagram story gone viral
Samantha : సమంత ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధితో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. దీని నుంచి పూర్తిగా కోలుకునేందుకు కొన్నాళ్ళు సినిమాలకు కూడా బ్రేక్ ప్రకటించింది. ప్రస్తుతం సమంత అమెరికాలో ఉంది. ఇటీవల జరిగిన న్యూయార్క్ 41వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్ళింది. కొన్ని రోజులు పాటు అక్కడే ఉండి మయోసైటిస్ కి చికిత్స తీసుకోనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే, సమంత తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో ఒక పోస్ట్ షేర్ చేసింది.
Raashii Khanna : సాయి ధరమ్ తేజ్ కోసం రాశి ఖన్నా ఏం పాడింది భయ్యా.. ఆ వాయిస్‌లో ఏదో మ్యాజిక్..
దానిలో ఇలా రాసి ఉంది.. “మీకు ఎప్పుడైనా అవకాశం వస్తే, ఒంటరిగా వెళ్లండి. ఒంటరిగా నడవండి, ఒంటరిగా ప్రయాణించండి, ఒంటరిగా జీవించండి, ఒంటరిగా డాన్స్ చేయండి. కొద్దీ సేపటికి. మీకు ఎప్పుడైనా అవకాశం లభిస్తే.. ప్రపంచం కోరుకునేలా కాకుండా మీలా ఉండడానికి ప్రయత్నించండి. చాలా మందికి ఎవరైనా తమ పక్కన నిలబడితేనే ఎలా నిలబడాలో తెలుసు. అయితే అది మీ కథ కాదు. మీకు అవకాశం వచ్చినప్పుడు ఒంటరిగా నడవండి. ఒంటరిగా నడిచే అవకాశం ఒక అరుదైన బహుమతి అని తెలుసుకోండి. ఇది మీ జీవిత గమనాన్ని మార్చగల అంతర్దృష్టిని మీకు అందజేస్తుంది” అని పేర్కొంది.
Samantha shares Loneliness quote in her instagram story gone viral
అయితే సమంత ఇది ఏ ఉద్దేశంతో పెట్టిందో తెలియదు. కానీ అభిమానులు మాత్రం.. ఆమె మయోసైటిస్ వల్ల ఒంటరితనం అనుభవిస్తుంది అందుకనే ఇలాంటి పోస్ట్ పెట్టిందని భావించి సోషల్ మీడియా వేదికగా ఆమెకు ధైర్యం చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే, సమంత నటించిన ఖుషి (Kushi) సినిమా రిలీజ్ కి సిద్దమవుతుంది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటించిన ఈ సినిమాని శివ నిర్వాణ డైరెక్ట్ చేశాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న రిలీజ్ కి సిద్దమవుతుంది.
