Samantha : సమంత ఇక తెలుగు సినిమాల్లో కన్పించదా?
టాలీవుడ్ బ్యూటీ క్వీన్ సమంత ఏం చేస్తోంది? చై.. శోభిత ధూళిపాల నిశ్చితార్థంపై సామ్ స్పందన ఏంటన్నది ప్రతి ఒక్కరినీ ఉత్కంఠకు గురిచేస్తోంది.
- Thota Vamshi Kumar
- Published On : August 12, 2024 / 09:15 PM IST
Samantha takes a shocking decision over Tollywood movies
Samantha : టాలీవుడ్ బ్యూటీ క్వీన్ సమంత ఏం చేస్తోంది? చై.. శోభిత ధూళిపాల నిశ్చితార్థంపై సామ్ స్పందన ఏంటన్నది ప్రతి ఒక్కరినీ ఉత్కంఠకు గురిచేస్తోంది. తన మాజీ భర్త తాజా ఎంగేజ్మెంట్‌పై సామ్ ఏమనుకుంటుందనే విషయం తెలుసుకునేందుకు సోషల్ మీడియాను జల్లెడ పడుతున్నారు నెటిజెన్స్. ఐతే ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయని సామ్.. ఇకపైనా ఈ విషయంలో స్పందించకూడదని నిర్ణయం తీసుకుందంట. అందుకోసం టాలీవుడ్‌కు దూరంగా ఉండాలని, మరికొన్నాళ్లు ముంబైలోనే గడపాలని నిర్ణయించుకుందట బ్యూటీ క్వీన్ సమంత.
ప్రస్తుతం ముంబైలో ఉంటున్న సమంత.. బాలీవుడ్ వెబ్ సిరీస్‌ల్లో ఎక్కువగా నటిస్తున్నారు. తెలుగులో ప్రస్తుతం ఆమెకు ఎలాంటి సినిమాలు లేకపోవడం, వెబ్ సిరీస్ షూటింగ్‌ల కోసం ముంబైలోనే ఎక్కువగా గడుపుతున్నారు సమంత. దీంతో కొన్నాళ్లుగా హైదరాబాద్‌లో కనిపించడం లేదు సమంత. ఇలాంటి సమయంలో నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ జరగడంతో ఇక కొన్నాళ్లు ముంబైలో ఉండిపోవాలని నిర్ణయం తీసుకున్నారట.
Venu Swamy : నాగచైతన్య- శోభితల జాతకం.. వేణుస్వామికి షాక్.. కలుద్దామన్న మంచు విష్ణు..!
నాగ చైతన్యతో విడాకులు తర్వాత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సమంత ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితుల నుంచి బయటపడుతున్నారు. ఇలాంటి సమయంలో నాగ చైతన్య మరో వివాహానికి అడుగులు పడటం..దీనిపై సమంతను స్పందించాలని మీడియా ప్రశ్నించే అవకాశం ఉండటంతో అన్నిటికీ దూరంగా ఉండాలని సమంత నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున అటువైపు చూడకూడదని భావిస్తున్నారట. సో నాగ చైతన్య ఎంగేజ్మెంట్ ఎఫెక్ట్‌తో సామ్ ఇక ముంబైకే పరిమితమవుతారా? అంతా సద్దుమణిగాక హైదరాబాద్ వస్తారా? అనేదే ఫ్యాన్స్‌లో ఉత్కంఠ రేపుతోంది.
