Samantha : సమంతకు అహంకారం.. ఆ దెబ్బకు..
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత తన లైఫ్ గురించి ఆసక్తికర విషయం తెలిపింది.(Samantha)
- Saketh U
- Published on- June 17, 2026 / 09:17 AM IST
Samantha
Samantha : సమంత మా ఇంటి బంగారం సినిమాతో జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం సమంత ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత తన లైఫ్ గురించి ఆసక్తికర విషయం తెలిపింది.
సమంత మాట్లాడుతూ.. నేను ఒకానొక సమయంలో స్టార్ డమ్ అనే మత్తుకు బానిస అయ్యాను. ఓ ఏడాది అయిదు సినిమాలు చేశాను. అవన్నీ హిట్స్ అయ్యాయి. దాంతో నన్ను గోల్డెన్ లెగ్ అన్నారు. ఓ చిన్నపట్టణం నుంచి వచ్చిన నాకు ఈ స్టార్ డమ్ చాలా ఆశ్చర్యాన్ని ఇచ్చింది. అభిమానులు, ప్రేక్షకులు నా పేరును అరవడం, నా కోసం, నా సినిమాల కోసం ఎదురుచూడటం సంతోషం ఇచ్చింది. దాంతో ఇంకా ఎక్కువ కష్టపడ్డాను.
అంచనాలకు తగ్గట్టు ఉండాలని నా మీద నేనే ఒత్తిడి పెట్టుకున్నా. చాలా బిజీ అయ్యా. ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలి, నటిగా నాకు ముగింపు ఉండదు అనే అహంకారం వచ్చింది. కానీ ఆరోగ్య సమస్యలు రావడం, సినిమాలకు బ్రేక్ పడటంతో నా ఆలోచన విధానం మారింది. తిరిగి సినిమాల్లోకి వస్తే కొన్ని అలవాట్లు మార్చుకోవాలని నిర్ణయించుకున్నాను. సినిమాలకు విరామం తర్వాత జీవితాన్ని, కెరీర్ ని కొత్త కోణంలో చూసాను అని తెలిపింది.
సమంత వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పుడే నాగచైతన్యతో విడాకులు అవ్వడం, మాయోసైటిస్ అనే ఆరోగ్య సమస్యతో బాధపడటం జరగడంతో ఒకేసారి కెరీర్ కి గ్యాప్ వచ్చింది. దాంతో సినిమాలు పక్కనపెట్టి హెల్త్ పై ఫోకస్ చేసింది. హెల్త్ సెట్ అయ్యాక వేరే వ్యాపారాలు చేస్తూ, నిదానంగా సినిమాలు చేస్తూ నిర్మాతగా కూడా మారింది.
