బాలీవుడ్ నటి సమీరారెడ్డి జులైలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాను తల్లి అయినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ భామ తన రెండు నెలల కూతురిని ఎత్తుకుని కర్ణాటక రాష్ట్రంలోని అతి ఎత్తైన మల్లయన గిరి పర్వతం ఎక్కి పెద్ద సాహసం చేసింది. పర్వతం పైకి వెళ్తుండగా దారి మధ్యలో ఓ వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామలో పోస్ట్ చేసింది.
ఈ వీడియోలో సమీరా మాట్లాడుతూ.. ఇది 6300 అడుగుల ఎత్తైన పర్వతం. ఒక బిడ్డకు డెలివరి ఇచ్చిన తర్వాత ఏ మాత్రం భయపడకుండా తల్లులు మరింత ఎనర్జీతో ముందుకు సాగాలంటూ ఓ సందేశాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.