Sampath Nandi : ‘జయహో జనార్ధన’ పోస్టర్ లాంచ్ చేసిన సంపత్ నంది..
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ని డైరెక్టర్ సంపత్ నంది లాంచ్ చేసారు. (Sampath Nandi)
- Saketh U
- Published On : April 10, 2026 / 07:14 PM IST
Sampath Nandi
Sampath Nandi : పానుగంటి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పానుగంటి శరత్ రెడ్డి నిర్మాతగా దర్శకుడుగా తెరకెక్కిస్తున్న సినిమా ‘జయహో జనార్ధన’. నరేష్ వాసం, రమ్యశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా ఈ సినిమాలో 30 ఇయర్స్ పృథ్వీ, రోలర్ రఘు, చలాకి చంటి, మైమ్ మధు, దయానంద రెడ్డి, జబర్దస్త్ రాఘవ, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ రాజమౌళి, పటాస్ ప్రవీణ్, నెమలి రాజు.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
Also See : Nayan Sarika : ఫేవరేట్ హీరో రామ్ చరణ్ ని కలిసిన ఆనందంలో హీరోయిన్.. ఫొటోలు వైరల్..
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ని డైరెక్టర్ సంపత్ నంది లాంచ్ చేసారు. లవ్ కమర్షియల్ కామెడీ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు నిర్మాత, దర్శకుడు పానుగంటి శరత్ రెడ్డి తెలిపారు. పోస్టర్ లాంచ్ అనంతరం సంపత్ నంది.. నిర్మాత, దర్శకుడిని అభినందించి సినిమా మంచి విజయం సాధించాలని అన్నారు.
