Sampoornesh Babu : సంపూర్ణేష్ బాబు సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాడో తెలుసా? సినిమాల్లోకి రాకముందు సంపూ జీతం ఎంత?
సంపూర్ణేష్ బాబు విచిత్రమైన డ్రెస్ వేసుకొని పిలక, జుట్టుతో చూసి సాయి రాజేష్ కి నచ్చడంతో హృదయ కాలేయం సినిమాకు ఇతనైతే బెటర్ అని హీరోగా తీసుకున్నాడు.
- Saketh U
- Published On : August 6, 2023 / 01:58 PM IST
Sampoornesh Babu life and work before hrudaya kaleyam movie Sampoornesh salary before entry into movies
Sampoornesh Babu : ఒక్కసారిగా హృదయకాలేయం(Hrudaya Kaleyam) సినిమాతో సంపూర్ణేష్ బాబు ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఒక స్పూఫ్ కామెడీ లాంటి సినిమా హృదయకాలేయం. బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్(Sai Rajesh) మొదటి సినిమా కూడా హృదయకాలేయం. చాలా తక్కువ బడ్జెట్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా చేసే సంపూర్ణేష్ బాబుని హీరోగా పెట్టి సినిమా తీశాడు సాయి రాజేష్. అనూహ్యంగా ఈ సినిమా భారీ విజయం సాధించింది.
ప్రస్తుతం బేబీ సినిమా సక్సెస్ తో సాయి రాజేష్ పలు ఇంటర్వ్యూలు ఇస్తుండగా సంపూర్ణేష్ బాబు గురించి చెప్పాడు. సంపూర్ణేష్ బాబుది తెలంగాణలోని సిద్ధిపేట. హైదరాబాద్ లో ఓ గోల్డ్ షాప్ లో పని చేస్తూ జూనియర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించేవాడు. జూనియర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ట్రై చేసేవాడు. ఈ నేపథ్యంలో ఓ సారి ప్రసాద్ ల్యాబ్ లో అక్కడ ఉన్న పలువురికి తన ఫోటోలు ఇచ్చి ఆర్టిస్ట్ గా పరిచయం చేసుకొని ఏమన్నా చాన్సులు ఉంటే ఇమ్మంటూ అడుగుతూ సాయి రాజేష్ కి కూడా తన ఫోటోలు ఇచ్చాడు.
అప్పుడు సంపూర్ణేష్ బాబు విచిత్రమైన డ్రెస్ వేసుకొని పిలక, జుట్టుతో చూసి సాయి రాజేష్ కి నచ్చడంతో హృదయ కాలేయం సినిమాకు ఇతనైతే బెటర్ అని హీరోగా తీసుకున్నాడు. సాయి రాజేష్ హీరోగా చేస్తావా అని అడిగినప్పుడు నేనైతే డబ్బులు ఏమి ఇచ్చుకోలేను అని చెప్పాడట సంపూర్ణేష్ బాబు. అవసర్లేదు నేనే ఇస్తాను అని సాయి రాజేష్ సంపూని హీరోగా తీసుకున్నాడు. హృదయ కాలేయం సినిమా తర్వాత సంపూ కెరీర్ ఓ రేంజ్ కి మారిపోయిన సంగతి తెలిసిందే.
Chiranjeevi : తల్లి హీరోయిన్ గా.. కూతురు చెల్లిగా.. చిరంజీవి సరసన..
సంపూర్ణేష్ బాబు సినిమాల్లో ట్రై చేస్తూనే హైదరాబాద్ లో ఓ గోల్డ్ షాప్ లో పని చేసేవాడని, అప్పుడు అతని ఆదాయం నెలకు 7500 రూపాయలు అని చెప్పాడు సాయి రాజేష్. ఇక ఆ ఒక్క హృదయ కాలేయం సినిమా సంపూర్ణేష్ బాబు, సాయి రాజేష్ ఇద్దరి లైఫ్స్ ని తిప్పేసింది. సంపూ ఆ సినిమాతో స్టార్ అయిపోయి అనేక సినిమాలు చేశాడు, ఇంకా చేస్తున్నాడు. ఇక సాయి రాజేష్ కలర్ ఫోటో సినిమాకి నిర్మాతగా నేషనల్ అవార్డు అందుకున్నాడు, ఇప్పుడు బేబీ సినిమాతో భారీ విజయం సాధించాడు.
