SSS: మార్చేశారు.. ఓటీటీలోకి కాదు థియేటర్స్ కి వస్తోందట.. రిలీజ్ ఎప్పుడంటే?
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని(SSS) మూవీని ఓటీటీలో కాకుండా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.
- V Santhosh Kumar
- Published On : February 13, 2026 / 10:06 AM IST
sampradayini suppini suddapoosani movie release on theaters
SSS: టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని(SSS)’. ఆయన స్వీయ నిర్మాణంలో శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటి హీరోయిన్ గా నటిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు సుధీర్ శ్రీరామ్ తెరకెక్కిస్తున్నాడు. టీజర్, ట్రైలర్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజ్ కోసం ఆడియన్స్ చూస్తున్నారు.
Manasa Varanasi: కపుల్ ఫ్రెండ్లీ ప్రీ వాలెంటైన్ పార్టీలో మానస వారణాసి.. ఫొటోలు వైరల్
అయితే, ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమాను ముందుగా ఓటీటీలో విడుదల చేయాలనీ ప్లాన్ చేయాలనీ అనుకున్నారు. ఫిబ్రవరి 12న ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనీ ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్టుగా ప్రమోషన్లు కూడా చేశారు. కానీ, ఫిబ్రవరి 12న స్ట్రీమింగ్ రాలేదు. దానికి కారణం ఏంటంటే, ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమాను థియేటర్స్ లో విడుదల చేస్తన్నారు మేకర్స్. ఈమేరకు అధికారిక ప్రకటన చేస్తూ వీడియో కూడా విడుదల చేశారు. మార్చ్ 6న విడుదల చేయనున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. దీంతో ఈ సినిమా కోసం చూస్తున్న ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఓటీటీ నుంచి థియేటర్స్ కి వెళ్తున్న ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమాకు ఆడియన్స్ ఎలాంటి రిజల్ట్ ఇస్తారు అనేది చూడాలి.
