Samuthirakani: విజయ్- త్రిష వివాదం.. ప్రైవేట్ వీడియో వైరల్.. క్లారిటీ ఇచ్చిన సముద్రఖని
విజయ్- త్రిష కలిసి పబ్లిక్ గా కనిపించడంపై షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు, దర్శకుడు సముద్రఖని(Samuthirakani).
- V Santhosh Kumar
- Published On : March 27, 2026 / 12:34 PM IST
Samuthirakani Sensational Comments on Vijay-Trisha Controversy
- విజయ్- త్రిష తీరుపై సముద్రఖని కామెంట్స్
- వీడియో అయిన వీడియో
- నిజాయితీగా మాట్లాడాను అంటూ క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
Samuthirakani: తమిళ రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపిన విజయ్-త్రిష వివాదంపై నటుడు, దర్శకుడు సముద్రఖని ఎట్టకేలకు స్పష్టతనిచ్చారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘కార్మేని సెల్వం’ ప్రమోషన్లలో భాగంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ, సోషల్ మీడియాలో వైరల్ తన వీడియో, అందులో ఉన్న వ్యాఖ్యల గురించి వివరణ ఇచ్చారు. టీవీకే అధినేత విజయ్‌ను తాను అవమానించలేదని, తన మాటలను సందర్భానికి సంబంధం లేకుండా వక్రీకరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Pragya Jaiswal: రెడ్ కలర్ డ్రెస్సులో గ్లామర్ బ్యూటీ.. ప్రగ్యా జైస్వాల్ స్టన్నింగ్ లుక్స్.. ఫొటోలు
ఇటీవల ఓ పెళ్లి వేడుకలో విజయ్, త్రిష కలిసి కనిపించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సముద్రఖని(Samuthirakani) కొందరితో చర్చిస్తున్న వీడియో బయటకు రావడంతో ఈ వివాదం మొదలైంది. ఆ వీడియోలో వారి(విజయ్- త్రిష) ప్రవర్తనపై ఆయన(సముద్రఖని) అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కనిపించింది. అయితే, ఆ వీడియోను ఎవరో కావాలనే రికార్డ్ చేసి వైరల్ చేశారని సముద్రఖని క్లారిటీ ఇచ్చారు.
విజయ్‌కు మొదటి నుంచి నేను అండగా ఉన్నానని, అందుకే కొన్ని విషయాల్లో బాధ కలిగడం సహజమని అన్నారు. ఇలాంటి వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేస్తూ ఎవరి మీద పగ తీర్చుకుంటున్నారని, ఇలాంటి చర్యల వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తుంది, మద్దతుదారులు కూడా దూరమయ్యే ప్రమాదం ఉందనే అభిప్రాయాన్ని పంచుకున్నానని తెలిపారు. తాను నిజాయితీగా మాట్లాడానని, వాటిలో నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో, సముద్రఖని చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
