Samyuktha Menon: పెళ్లి చేసుకోబోతున్న సంయుక్త మీనన్.. రష్మిక లాగే తనుకూడా!
మలయాళ స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్(Samyuktha Menon) పెళ్లి వార్తలు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Updated on- April 22, 2026 / 08:10 AM IST
samyuktha menon marriage news goes viral on social media
- సంయుక్త పెళ్లి వార్తలు వైరల్
- గతంలోనే క్లారిటీ ఇచ్చిన నటి
- రష్మిక లాగే అంటున్న నెటిజన్స్
Samyuktha Menon: మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ గురించి, ఆమె సినిమాల గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. వరుసగా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. గతంలోనే ఈ పుకార్లపై స్పందించిన ఆమె, తన పెళ్లి గురించి కాకుండా తన నటనపై దృష్టి పెట్టాలని అనుకున్నట్టుగా క్లారిటీ ఇచ్చేసింది. తాజాగా ఈ వార్తలు మళ్ళీ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం 30 ఏళ్ల వయసున్న సంయుక్త(Samyuktha Menon), తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో వరుస ఆఫర్లతో కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉంది.
Tripuraneni Chitti Babu: ప్రముఖ నిర్మాత, దర్శకుడు త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత
వరుస విజయాలతో ‘గోల్డెన్ లెగ్’గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ, షూటింగ్‌ల బిజీలో ఉంటూనే పెళ్లి పీటలు ఎక్కే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కొందరు నెటిజన్లు రష్మిక తరహాలోనే సంయుక్త కూడా వివాహం తర్వాత తన కెరీర్‌ను కొనసాగిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆమె నిఖిల్ సరసన ‘స్వయంభు’ మరియు ‘బ్లాక్ గోల్డ్’ వంటి క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తోంది. మరి ఈ లేటెస్ట్ పెళ్లి పుకార్లకు సంయుక్త తనదైన శైలిలో ఎలా చెక్ పెడుతుందో వేచి చూడాలి.
