Sandeep Reddy Vanga : నిన్ను నా సినిమాలో పెట్టుకున్నందుకు సిగ్గుపడుతున్నాను.. నటుడిపై సందీప్ రెడ్డి వంగ కామెంట్స్..
తాజాగా తన కబీర్ సింగ్ సినిమాలో నటించిన ఓ నటుడు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు సందీప్ వంగ.
- Saketh U
- Updated on- April 18, 2024 / 04:39 PM IST
Sandeep Reddy Vanga Counter to Actor Adil Hussain Comments on Kabir Singh Movie
Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ సినిమాలు బోల్డ్ ఉంటాయని, నెగిటివిటీ ఉంటుందని విమర్శలు వస్తుంటాయి. కొంతమంది సందీప్ వంగ సినిమాలపై నెగిటివ్ గా కామెంట్స్ చేస్తూ ప్రచారం చేసినా సందీప్ అవి పట్టించుకోడు. ఒక్కోసారి తన సినిమాల గురించి మాట్లాడిన వాళ్ళకి కౌంటర్లు ఇస్తాడు. తాజాగా తన కబీర్ సింగ్(Kabir Singh) సినిమాలో నటించిన ఓ నటుడు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు సందీప్ వంగ.
నటుడు అదిల్ హుస్సేన్(Adil Hussain) సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ సినిమా కబీర్ సింగ్ లో ప్రిన్సిపాల్ పాత్రలో నటించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కబీర్ సింగ్ సినిమా చేసినందుకు నేను పశ్చాత్తాప పడుతున్నాను. ఆ పాత్ర చేయకుండా ఉండాల్సింది. నేను నటించిన సీన్ మంచిదే కానీ సినిమానే. నాకు సినిమా కథ తెలియకుండా నటించాను. సినిమా రిలీజ్ అయ్యాక చూసి మధ్యలోనే వచ్చేసాను. ఇలాంటి సినిమానా నేను చేసింది అని ఫీల్ అయ్యాను. ఇలాంటి సినిమా ఎవర్ని చూడమని సజెస్ట్ చేయను కూడా. మా ఆవిడకు చెప్తే నన్ను తిడుతుంది ఇలాంటి సినిమా చేసానని అంటూ వ్యాఖ్యలు చేసాడు.
Also Read : The Raja Saab : నిధి అగర్వాల్‌తో రాజాసాబ్ సాంగ్ షూట్.. పాట రిలీజ్‌పై తేజ సజ్జ కామెంట్స్..
ఈ వ్యాఖ్యలపై సందీప్ రెడ్డి వంగ స్పందించాడు. అదిల్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలను ట్విట్టర్లో షేర్ చేసి.. మీరు నమ్మిన 30 ఆర్ట్ సినిమాల నుంచి రాని పేరు ఒక్క బ్లాక్ బస్టర్ సినిమా నుంచి వచ్చినందుకు మీరు పశ్చాత్తాప పడుతున్నారా? నేను నా సినిమాలో మిమ్మల్ని పెట్టుకున్నందుకు పశ్చాత్తాప పడుతున్నాను. మీ ప్యాషన్ కంటే కూడా మీ దురాశ పెద్దది. నేను సినిమాలో మీ ముఖాన్ని AI సహాయంతో మార్చి మీరు సిగ్గుపడకుండా నేను కాపాడతాను. ఇప్పుడు హ్యాపీగా నవ్వుకోండి అంటూ కౌంటర్ ఇచ్చాడు. దీంతో సందీప్ రెడ్డి వంగ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. మరి దీనికి అదిల్ హుస్సేన్ ఏమైనా రియాక్ట్ అవుతాడేమో చూడాలి.
