The Raja Saab : నిధి అగర్వాల్‌తో రాజాసాబ్ సాంగ్ షూట్.. పాట రిలీజ్‌పై తేజ సజ్జ కామెంట్స్..
నిధి అగర్వాల్‌తో సాంగ్ షూట్ జరుపుకుంటున్న రాజాసాబ్. ఫస్ట్ సాంగ్ రిలీజ్ పై తేజ సజ్జ కామెంట్స్..

Teja Sajja comments on Prabhas The Raja Saab movie song release
The Raja Saab : మారుతీ డైరెక్షన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న హారర్ కామెడీ సినిమా ‘ది రాజాసాబ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చితం సైలెంట్ షూటింగ్ జరుపుకుంటూ వస్తుంది. కల్కి మూవీ షూటింగ్ కి గ్యాప్ వచ్చిన సమయంలో ప్రభాస్.. ఈ మూవీ సెట్స్ లో పాల్గొంటూ షూట్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీలోని సాంగ్ షూట్ జరుగుతున్నట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రభాస్ అండ్ నిధి అగర్వాల్ పై ఈ పాట చిత్రీకరణ జరుగుతుందట. ఈ షూటింగ్ కోసం నిధి కూడా ఇటీవల హైదరాబాద్ వచ్చారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుంచి మొదటి సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు ప్రముఖ నిర్మాత SKN చేసిన ట్వీట్ కారణం. మ్యూజిక్ సింబల్స్ పెట్టి ఎస్‌కెన్ ట్వీట్ చేయగా.. దానికి దర్శకుడు మారుతీ రియాక్ట్ అవుతూ స్మైల్ సింబల్ తో కామెంట్ చేసారు.
Also read : Aadi Saikumar : సూపర్ హిట్ కాంబో రిపీట్.. ఆది సాయికుమార్ కొత్త సినిమా అనౌన్స్..
దీంతో రాజాసాబ్ నుంచి సాంగ్ రాబోతుందని వార్తలు వినిపించాయి. ఇక రీసెంట్ గా ఈ మూవీ నిర్మాతలు.. తేజ సజ్జ సినిమా ఈవెంట్ తో మీడియా ముందుకు వచ్చారు. ఇక ఈ ఈవెంట్ లో రాజాసాబ్ గురించి నిర్మాత టిజి విశ్వప్రసాద్ ని ప్రశ్నించగా, ఆయన బదులిస్తూ.. “కల్కి రిలీజ్ అయిన తరువాత రాజాసాబ్ నుంచి అప్డేట్స్ వస్తాయి” అని చెప్పుకొచ్చారు.
అయితే ఇంతలో తేజ సజ్జ మాట్లాడుతూ.. “నాకెందుకో రాజాసాబ్ నుంచి త్వరలో ఓ సాంగ్ రాబోతుందని డౌట్ గా ఉందండి” అంటూ కామెంట్స్ చేసారు. ఇక ఈ కామెంట్స్ కి నిర్మాత చిరు నవ్వుతో సమాధానం ఇచ్చారు. మరి ఈ సాంగ్ ని ఎప్పుడు ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తారో చూడాలి. కాగా ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ తో పాటు ఈ సినిమాలో రిధి కుమార్, మాళవిక మోహనన్ కూడా కనిపించబోతున్నారు.
Question: Any updates on #Prabhas‘s #TheRajaSaab which has always been the talk of the town?
Producer: We’ll reveal updates post the release of #Kalki2898AD!#TejaSajja: I’m guessing the first song of #TheRajaSaab will drop very very soon!
pic.twitter.com/brMegnZTE7— PrabhasWarriors? (@PRABHASWARRlORS) April 18, 2024