Aadi Saikumar : సూపర్ హిట్ కాంబో రిపీట్.. ఆది సాయికుమార్ కొత్త సినిమా అనౌన్స్..
సూపర్ హిట్ కాంబో రిపీట్ చేస్తూ కొత్త సినిమాని అనౌన్స్ చేసిన ఆది సాయి కుమార్.

Aadi Saikumar announce his new movie Krishna from brindavanam
Aadi Saikumar : టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్.. సినిమాలు, వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్నారు. విజయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న వస్తున్న ఈ హీరో గత ఏడాది.. ఏకంగా ఇది చిత్రాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఇక ఇటీవల ‘CSI సనాతన’ సినిమాతో మంచి రివ్యూలనే అందుకున్నారు. ప్రస్తుతం మూడు సినిమాలను లైన్ లో పెట్టిన ఆది సాయి కుమార్.. తాజాగా మరో సినిమా స్టార్ట్ చేసారు.
అదికూడా సూపర్ హిట్ కాంబోని రిపీట్ చేస్తూ ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. గతంలో తనకి ‘చుట్టలబ్బాయ్’ సినిమాతో మంచి విజయాన్ని అందించిన దర్శకుడు వీరభద్రమ్ చౌదరితో కలిసి మరో సినిమాని తీసుకు రాబోతున్నారు. చుట్టలబ్బాయ్ మూవీ లాగానే ఈ చిత్రం కూడా విలేజ్ డ్రామాతో ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీతో ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతుందట.
Also read : Sreeleela : నెల్లూరు కుర్రాళ్లతో స్టేజిపై.. ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్‌కి శ్రీలీల డాన్స్..
ఇక ఈ చిత్రానికి ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. నేడు ఈ మూవీని పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసారు. దిల్ రాజు, అనిల్ రావిపూడి, సాయి కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్ పై తూము నరసింహా, జామి శ్రీనివాసరావు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ మూవీ లాంచ్ తో పాటు ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసారు. దిగంగనా సూర్యవంశీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకోనుంది.
View this post on Instagram