Sreeleela : నెల్లూరు కుర్రాళ్లతో స్టేజిపై.. ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్‌కి శ్రీలీల డాన్స్..

నెల్లూరు కుర్రాళ్లతో స్టేజిపై 'కుర్చీ మడతపెట్టి' సాంగ్‌కి డాన్స్ వేసి అదరగొట్టిన శ్రీలీల.

Sreeleela : నెల్లూరు కుర్రాళ్లతో స్టేజిపై.. ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్‌కి శ్రీలీల డాన్స్..

Sreeleela dance with nellore college students for kurchi madatha petti song

Updated On : April 18, 2024 / 1:09 PM IST

Sreeleela : డాన్సింగ్ స్టార్ శ్రీలీల మొన్నటివరకు నెలకొక సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి సందడి చేసి.. ఇప్పుడు సైలెంట్ అయ్యిపోయారు. ప్రస్తుతం ఈమె చేతిలో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తప్ప మరొక మూవీ లేదు. ఫ్యాన్స్ అంతా ఆమె నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్డేట్ కోసం ఎదురు చూస్తుంటే.. ఆమె మాత్రం కాలేజీ ఫెస్ట్‌లకు గెస్ట్ గా వెళ్తూ సందడి చేస్తున్నారు. ఇటీవల తమిళనాడులోని ఓ కాలేజీ ఫెస్ట్ కి వెళ్లి అక్కడ సందడి చేసారు.

ఇక రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ నెల్లూరులోని కాలేజీ ఫెస్ట్ లో సందడి చేసారు. నెల్లూరులోని ఓ కాలేజీ ఫెస్ట్ కి గెస్ట్ గా వెళ్లిన శ్రీలీల.. అక్కడి స్టూడెంట్స్ తో స్టేజి పై ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ కి డాన్స్ వేసి అదుర్స్ అనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియోని మీరు కూడా చూసేయండి.

Also read : Robinhood : రష్మిక పోయి రాశి వచ్చే.. నితిన్ ‘రాబిన్ హుడ్’ అప్డేట్..

 

View this post on Instagram

 

A post shared by Rajesh Manne Official (@rajeshmanne1)

కాగా శ్రీలీల గత ఏడాది నాలుగు సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఇక ఈ ఏడాది స్టార్టింగ్ లో గుంటూరు కారంతో సందడి చేసారు. అయితే వీటిలో ఎక్కువ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటలేకపోయాయి. దీంతో శ్రీలీలకి ఇప్పుడు ఒక మంచి విజయం కావాల్సి ఉంది. మరి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తో ఆ హిట్టుని అందుకుంటారో లేదో చూడాలి.

హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం కేవలం 10 శాతం షూటింగ్ ని మాత్రమే జరుపుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ అవ్వడంతో.. ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ లు పడ్డాయి. ఏపీలో ఎన్నికలు పూర్తి అవ్వగానే మళ్ళీ ఈ మూవీ షూటింగ్ పట్టాలు ఎక్కనుంది.