Prabhas : ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ అప్డేట్ ఇచ్చిన సందీప్ వంగా.. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా..?
సందీప్ వంగా దర్శకత్వంలో ప్రభాస్ 'స్పిరిట్' అనే సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో సందీప్ వంగా ఒక అప్డేట్ ఇచ్చేశారు.
- gum 95921
- Published On : November 24, 2023 / 09:10 AM IST
Sandeep Reddy Vanga gave update on Prabhas Spirit movie at Unstoppable show
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్, కల్కి, మారుతీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాలు తరువాత సందీప్ వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమా చేయనున్న విషయం కూడా తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా..? అని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా దీని గురించి సందీప్ వంగా ఒక అప్డేట్ ఇచ్చేశారు. సందీప్ డైరెక్ట్ చేసిన తాజా చిత్రం ‘యానిమల్’ రిలీజ్ కి సిద్దమవుతుంది. రణబీర్ కపూర్, రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోహీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ వంగా, రణబీర్, రష్మిక.. బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి వచ్చారు. ఈ ఎపిసోడ్ నేడు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఇక ఈ ఎపిసోడ్ లోనే బాలకృష్ణ.. ప్రభాస్ స్పిరిట్ సినిమా గురించి ప్రశ్నించారు. దీనికి దర్శకుడు సందీప్ బదులిస్తూ.. 2024 సెప్టెంబర్‌లో మొదలు కాబోతుందంటూ బదులిచ్చారు. దీంతో రెబల్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా ఆ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నారని సమాచారం. ఇక ఈ స్పిరిట్ మూవీ చూడాలంటే 2025 వరకు వేచి చూడాల్సిందే.
Also read : Dhruva Natchathiram : రిలీజ్‌కి ఒక్క రోజు ముందు.. మళ్ళీ వాయిదా పడ్డ ధ్రువ నక్షత్రం..
కాగా ఈ సినిమాలో ఒక చిన్న పాత్ర అయినా ఇస్తే చేయాలని ఉందంటూ రణబీర్ కపూర్.. సందీప్ వంగాని కోరారు. మరి ఆ మూవీలో ఏమన్నా క్యామియో రోల్స్ ఉంటాయా లేదా చూడాలి. ఇక ప్రభాస్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. సలార్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం ఈ డిసెంబర్ లో రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా రెండు భాగాలకు సంబంధించిన షూట్ పూర్తి అయ్యిపోయిందా..? లేదా..? అనేది ప్రశ్నగా మారింది. ఇక కల్కి కూడా రెండు భాగాలుగా రాబోతుందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మారుతీ సినిమా షూటింగ్ సైలెంట్ పూర్తి చేసేసుకుంటుంది.
