Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ ఒక్క వీడియోతో.. పాపం రాజమౌళి ‘వారాణసి’ని పక్కన పెట్టేసారుగా..
కనీసం గ్లింప్స్ కాకపోయినా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు అని ఆవేదన చెందారు. (Sandeep Reddy Vanga)
- Saketh U
- Published on- August 10, 2026 / 05:58 PM IST
Sandeep Reddy Vanga
Sandeep Reddy Vanga : నిన్న ఆగస్టు 9 మహేష్ బాబు పుట్టిన రోజు కావడంతో అందరూ రాజమౌళి వారణాసి సినిమా నుంచి అప్డేట్ ఆశించారు. కానీ రాజమౌళి సింపుల్ గా షూటింగ్ గ్యాప్ లో తీసిన రెండు ఫొటోలు రిలీజ్ చేసి పండగ చేసుకోండి అన్నట్టు బర్త్ డే పోస్ట్ పెట్టారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు. కనీసం గ్లింప్స్ కాకపోయినా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు అని ఆవేదన చెందారు.
ఈ దెబ్బతో మహేష్ బర్త్ డే అన్న హైప్ లేకుండా పోయింది. కానీ ఒక్కసారిగా ఆ హైప్ ని సందీప్ రెడ్డి వంగ తీసుకొచ్చాడు. సందీప్ రెడ్డి వంగ కృష్ణ చెప్పిన ఓ డైలాగ్ ని AI వాడి మహేష్ బాబు చెప్పినట్టు వీడియో చేసి, ఆ వీడియోని షేర్ చేసి మహేష్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ఆ మాస్ వీడియో వైరల్ అయింది. అది AI వీడియో అయినా ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా ఉంది. దానికి తోడు మహేష్ బాబు సందీప్ పోస్ట్ కి రిప్లై ఇచ్చి థ్యాంక్స్ చెప్పాడు.
Also Read : Sameera Bharadwaj : బాబోయ్.. సింగర్ సమీరా భరద్వాజ్ స్టైలిష్ లుక్స్ చూశారా..
దీంతో నిన్నంతా సందీప్ రెడ్డి వంగ షేర్ చేసిన వీడియో పోస్ట్ వైరల్ అయింది. మహేష్ ఫ్యాన్స్ కూడా రాజమౌళి షేర్ చేసిన సింపుల్ ఫోటోల కంటే కూడా సందీప్ షేర్ చేసిన మాస్ వీడియోనే ఇష్టపడ్డారు. అసలు ఈ మాస్ వీడియో సృష్టించిన హైప్ కి నిన్న వారణాసి సినిమా, రాజమౌళి షేర్ చేసిన మహేష్ ఫొటోలను పెద్దగా పట్టించుకోలేదు జనాలు.
దీనికి తోడు గతంలో మహేష్ బాబుతో సందీప్ రెడ్డి వంగ సినిమా ఉందని, ఆల్రెడీ కథ చెప్పాడని, దానికి డెవిల్ అనే టైటిల్ కూడా పెట్టాలని ప్రచారం జరిగింది. ఇంకేముంది ఇప్పుడు సందీప్ బర్త్ డే విషెష్ చెప్తూ ఈ వీడియో పోస్ట్ చేయడంతో వీళ్లిద్దరి కాంబోలో సినిమా ఉంటుందని, ఉండాలని ఫ్యాన్స్ ఊహించేస్తునారు. మరి సందీప్ – మహేష్ సినిమా వారణాసి తర్వాత ప్లాన్ చేస్తే పోకిరికి మించి బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
Also Read : Ramayana : ఇదేం రిలీజ్ ప్లానింగ్ రా బాబు.. ‘రామాయణ’ రిలీజ్ పై నిర్మాత వ్యాఖ్యలు.. ఇండియాలో..
