Sandeep Reddy Vanga : సందీప్ వంగ మల్టీస్టారర్..? బాలీవుడ్ హీరోతో ప్రభాస్.. ఆ సీక్వెల్ లో..?
Sandeep Vanga-Prabhas: తాజాగా సందీప్ వంగ నెక్స్ట్ సినిమాపై ఆసక్తికర రూమర్ వినిపిస్తుంది. (Sandeep Reddy Vanga)
- Saketh U
- Updated on- April 23, 2026 / 04:28 PM IST
Sandeep Reddy Vanga Planning Huge Multistarrer With Prabhas In Bollywood
Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ తీసిన మూడు సినిమాలతోనే ఇండియన్ సినీ పరిశ్రమని షేక్ చేసేసాడు. తన నెక్స్ట్ సినిమా కోసం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కూడా ఎదురుచూస్తుంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 2027 లో ఈ సినిమా రాబోతుంది. తాజాగా సందీప్ వంగ నెక్స్ట్ సినిమాపై ఆసక్తికర రూమర్ వినిపిస్తుంది.
ఇన్‌టెన్స్ సీన్లు, క్రైమ్ యాక్షన్ డ్రామా.. రణ్‌బీర్ హీరోగా, డేరింగ్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో వచ్చిన యూనిమల్ మూవీ ఏ రేంజ్‌లో సక్సెస్ కొట్టిందో చెప్పక్కర్లేదు. యానిమల్ మూవీకి సీక్వెల్ కూడా అనౌన్స్ చేసారు. యానిమల్ పార్క్ అంటూ అనౌన్స్ చేయడంతో ఆ సినిమాపై కూడా అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీపై ఇప్పుడో ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది.
Also See : వింత గెటప్పుల్లో ఈవెంట్ కి వచ్చిన మూవీ టీమ్.. సత్య అయితే మరీ షార్ట్ లో.. ఫొటోలు వైరల్..
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రానున్న యానిమల్ పార్క్ మూవీలో రణ్‌బీర్ కపూర్ పాత్రను డ్యూయల్ రోల్ లో మరింత పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నాడు. ఈ క్రమంలో ఒక స్పెషల్ కామియో ప్లాన్ చేస్తున్నారట. ఆ కామియో కోసం టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు బలంగా వినిపిస్తోంది. కథలో కీలక ట్విస్ట్ వేళ ప్రభాస్ ఎంట్రీ ఇస్తే సినిమా స్కేల్ మరో లెవెల్‌కి వెళ్తుందని లెక్కలు వేసుకుంటున్నారట. ఇది మాస్ ఆడియన్స్‌కి భారీ సర్ప్రైజ్ అవుతుందని చర్చ జరుగుతోంది.
ఇప్పుడు ప్రభాస్ తో సందీప్ స్పిరిట్ చేస్తున్నాడు. ఆల్రెడీ రణబీర్ కి భారీ హిట్ ఇచ్చాడు. వీళ్ళిద్దరితో సందీప్ కి మంచి అనుబంధం ఉంది. దీంతో యానిమల్ పార్క్‌లో ప్రభాస్ కామియో రోల్ చేస్తే మాత్రం బాలీవుడ్ టాలీవుడ్ కాంబినేషన్‌లో పెద్ద సెన్సేషన్ అవుతుందని చెప్పడంలో డౌటే లేదు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ పార్క్ స్పిరిట్ వచ్చిన తర్వాత 2027 లో సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే యానిమల్ పార్క్‌లో ప్రభాస్ కామియో రోల్ పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
Also Read : పాపం.. 29 ఏళ్ళ వయసులోనే నటి మృతి.. విషాదంలో సినీ పరిశ్రమ.. ఎలా మరణించిందంటే..
