Allu Arjun: పోలీసుల అదుపులో అల్లు అర్జున్
సినీ నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- Thota Vamshi Kumar
- Updated on- December 13, 2024 / 01:21 PM IST
Pushpa 2 Stampede: సినీ నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు బన్నీని అదుపులోకి తీసుకున్నారు.
డిసెంబర్ 4న పుష్ప2 ప్రీమియర్స్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Mohan Babu : మోహన్ బాబు ఇంటికి వెళ్లిన పోలీసులు.. నివాసంలో లేని డైలాగ్ కింగ్..!
మృతురాలి కుటుంబ సభ్యలు ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 105, 118 (1)r/w3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు. తాజాగా శుక్రవారం బన్నీ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
రూ.25లక్షల సాయం..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పై ఇప్పటికే అల్లు అర్జున్ స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి రూ.25లక్షల సాయం ప్రకటించారు. ఆమె కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
