Khalnayak Returns: 33 ఏళ్ల తర్వాత సీక్వెల్.. ‘ఖల్ నాయక్’ రిటర్న్స్‌ ఫస్ట్ లుక్ అరాచకం

33 ఏళ్ళ తరువాత బ్లాక్ బస్టర్ ఖల్ నాయక్ సినిమాకు సీక్వెల్ గా ఖల్ నాయక్’ రిటర్న్స్‌(Khalnayak Returns) ప్లాన్ చేస్తున్న సంజయ్ దత్.

sanjay dutt khalnayak returns announcement video out now

Khalnayak Returns: బాలీవుడ్ స్టార్ లెజెండరీ సంజయ్ దత్ తన కెరీర్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన మూవీ ఏదైనా ఉంది అంటే అది ‘ఖల్ నాయక్’ అనే చెప్పాలి. 1993లో విడుదలైన ఈ సినిమా సంచలనం సృష్టించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్‌ను ప్రకటిస్తూ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ‘ఖల్ నాయక్ రిటర్న్స్(Khalnayak Returns)’ పేరుతో విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్‌లో సంజయ్ దత్ మళ్ళీ ఐకానిక్ పాత్ర ‘బల్లు’గా కనిపించి అలరించారు. నోటిలో సిగరెట్, కళ్ళలో అదే మొరటుతనంతో ఆయన పవర్‌ఫుల్ అవతారం చూస్తుంటే సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో పెరుగుతున్నాయి.

Bobby Kolli: భార్యతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ బాబీ కొల్లి.. ఫొటోలు వైరల్

ఈ సీక్వెల్ వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన నేపథ్యాన్ని సంజయ్ దత్ స్వయంగా వెల్లడించారు. తాను జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో, తోటి ఖైదీలు ఇచ్చిన సలహా మేరకు ఈ కథను ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన కలిగిందని ఆయన తెలిపారు. ఒరిజినల్ చిత్ర దర్శకుడు సుభాష్ ఘై ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉండటం గమనార్హం. సంజయ్ దత్ సొంత బ్యానర్ త్రీ డైమెన్షన్ మోషన్ పిక్చర్స్, ఆస్పెక్ట్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జియో స్టూడియోస్ దీనిని సమర్పిస్తోంది.

అప్పట్లో భారతీయ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ యాక్షన్ డ్రామా ఇప్పుడు మళ్ళీ కొత్త హంగులతో రాబోతుండటంతో బాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పాత తరం ప్రేక్షకులకు నోస్టాల్జిక్ అనుభూతిని ఇస్తూనే, ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా ఈ సినిమాను రాజీ పడకుండా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. సంజయ్ దత్ మార్కు మాస్ మేనరిజమ్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ ప్రారంభించుకుని ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతోంది.