Sanjay Dutt: ‘అధీరా’ on the way..

  • Updated on- October 16, 2020 / 05:01 PM IST

Sanjay Dutt – KGF Chapter 2: బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొద్దిరోజులుగా ముంబైలోనే ఉంటూ కీమోథెరపీ చేయించుకుంటున్నారాయన. ముంబైలోని హెయిర్ స్టైలిష్ట్ ఆలిమ్ హకీమ్ సెలూన్‌లో కనిపించిన సంజయ్ కొత్త స్టైల్లోకి మారిపోయారు.

త్వరలో ‘కె.జి.యఫ్ 2’ (KGF Chapter 2) కోసం డిఫరెంట్ గా మేకోవర్ అయ్యారు సంజూ బాబా. ఈ పాన్ ఇండియా మూవీలో ఆయన ‘అధీరా’ పాత్రలో కనిపించనున్న సగతి తెలిసిందే. రాకింగ్ స్టార్ యష్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.


తాజాగా తన లేటెస్ట్ ఫొటోలను ప్రేక్షకులతో పంచుకున్నారు సంజయ్ దత్. నవంబర్ రెండు నుంచి KGF Chapter 2 షూటింగులో పాల్గొనబోతున్నానని, త్వరలోనే క్యాన్సర్ నుంచి బయటపడతానని ఆశాభావం వ్యక్తం చేశారు సంజూ.