Ram Charan: భన్సాలీ క్రేజీ మూవీలో ఛాన్స్ మిస్.. రామ్ చరణ్ స్థానంలోకి ధనుష్
సంజయ్ లీలా భన్సాలీ భారీ సినిమాలో హీరోగా ధనుష్ ను ఫిక్స్ చేసిన మేకర్స్(Ram Charan).
- V Santhosh Kumar
- Published on- April 28, 2026 / 04:49 PM IST
Sanjay Leela Bhansali Cast Dhanush Instead of Ram Charan in a Big-Budget Film
- భన్సాలీ మైథోలాజికల్ జంగిల్ డ్రామా.
- చరణ్ బదులుగా ధనుష్ ఎంపిక.
- భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్.
Ram Charan: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ సినిమాల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. విజువల్ వండర్ సినిమాలు చేయడంలో ఆయన దిట్ట. ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ ఈ స్టార్ మేకర్ నిర్మించనున్న భారీ బడ్జెట్ మైథోలాజికల్ జంగిల్ డ్రామా ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భారీ ప్రాజెక్టును భన్సాలీ ప్రొడక్షన్స్ పతాకంపై పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాతో మిత్రన్ హిందీ చిత్రసీమలోకి అడుగుపెడుతుండగా, అడవి నేపథ్యంలో సాగే ఒక పౌరాణిక గాథను విజువల్ వండర్‌గా రూపొందించేందుకు చిత్ర బృందం సన్నద్ధమవుతోంది.
Rakul Preet Singh: చెవులు పట్టుకుని క్షమాపణలు చెప్పిన జాకీ భగ్నానీ.. రకుల్ స్వీట్ వార్నింగ్
మొదట ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)తో చర్చలు జరిగాయి. రామ్ చరణ్ ఈ పాత్రకు సరిగ్గా సరిపోతారని భావించినప్పటికీ, పలు కారణాల వల్ల ఇప్పుడు ఈ అవకాశం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ను వరించిందని టాక్. ధనుష్ ఇలాంటి పాత్రలు చేయడంలో టాప్. ఆ నమ్మకంతో భన్సాలీ టీమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ధనుష్ కెరీర్‌లో ఇది మరో భారీ మైలురాయిగా నిలవనుంది.
ఈ సినిమా కథాంశం అడవి నేపథ్యంలో సాగే పురాణ కాలం నాటి ఘట్టాలతో కూడి ఉంటుందని సమాచారం. భన్సాలీ మార్క్ గ్రాండియర్, పి.ఎస్.మిత్రన్ టేకింగ్ తోడైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. రామ్ చరణ్ నుండి ధనుష్ చేతికి వెళ్లిన ఈ ‘మైథోలాజికల్ జంగిల్ డ్రామా’ పై ఇటు సౌత్, అటు నార్త్ ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి మరి.
