Rakul Preet Singh: చెవులు పట్టుకుని క్షమాపణలు చెప్పిన జాకీ భగ్నానీ.. రకుల్ స్వీట్ వార్నింగ్
చెవులు పట్టుకుని మరీ భార్య రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)కు క్షమాపణలు చెప్పిన జాకీ భగ్నాన్ని
Jackky Bhagnani holds his ears as Rakul Preet Singh says about situationship remark
- భర్త వ్యాఖ్యలపై రకుల్ సెటైర్లు.
- వార్తల వక్రీకరణపై నటి అసహనం.
- నవ్వుతూ క్లారిటీ ఇచ్చిన జంట.
Rakul Preet Singh: బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ తన భార్య రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh)తో ఉన్న బంధాన్ని ఉద్దేశించి చేసిన ‘సిట్యుయేషన్ షిప్’ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కామెంట్స్ పై రకుల్ తనదైన శైలిలో స్పందించారు. ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో జాకీ మాట్లాడుతూ, తాము పెళ్లి చేసుకున్నప్పటికీ ఒకరితో ఒకరు దేని గురించైనా స్వేచ్ఛగా మాట్లాడుకుంటామని, ఆ చనువు వల్ల అది ఒక ‘సిట్యుయేషన్ షిప్’ లాంటిదని సరదాగా పేర్కొన్నారు. అయితే నెటిజన్లు ఆ ఒక్క మాటను పట్టుకుని రకరకాలుగా చర్చించడంతో, రకుల్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ అంశంపై స్పష్టతనిస్తూ అందరినీ నవ్వించారు.
NTRNeel: నాన్నకు ప్రేమతో.. తండ్రీకొడుకులుగా ఎన్టీఆర్.. ‘డ్రాగన్’ కథ అదేనా!
తన భర్త జాకీని ఆటపట్టిస్తూ రకుల్ ఒక వీడియోను షేర్ చేశారు. “మనం మిలీనియల్స్ అని ఎన్నిసార్లు చెప్పాలి.. జెన్-జీ (Gen-Z) పదాలు వాడాల్సిన అవసరం లేదు” అని సరదాగా మందలించారు. దీనికి జాకీ బదులిస్తూ, తాను ఆ అర్థంతో అనలేదని చెవులు పట్టుకుని క్షమాపణలు కోరడం గమనార్హం. గంటల కొద్దీ జరిగిన సంభాషణలో ఒక చిన్న ముక్కను తీసుకుని క్లిక్‌బైట్ హెడ్ లైన్స్‌గా మార్చడంపై రకుల్ అసహనం వ్యక్తం చేస్తూనే, సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలని నెటిజన్లకు సూచించారు.
ముఖ్యంగా మీడియా సంస్థలు వార్తలను సృష్టించేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని, కేవలం వ్యూస్ కోసం మాటలను వక్రీకరించవద్దని రకుల్ కోరారు. మూడేళ్ల పాటు ప్రేమలో ఉండి, 2024 ఫిబ్రవరిలో గోవాలో వివాహం చేసుకున్న ఈ జంట మధ్య ఉన్న అనుబంధం చాలా దృఢమైనదని ఆమె స్పష్టం చేశారు. అనవసరపు ప్రచారాలను నమ్మి సమయం వృధా చేయకుండా, నవ్వుకుని వదిలేయాలని రకుల్ ఈ వివాదానికి ముగింపు పలికారు. ప్రస్తుతం ఈ సెటైరికల్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
