NTRNeel: నాన్నకు ప్రేమతో.. తండ్రీకొడుకులుగా ఎన్టీఆర్.. ‘డ్రాగన్’ కథ అదేనా!
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్(NTRNeel) సినిమా కథ నెట్టింట వైరల్ గా మారుతోంది.
Prashanth Neel and NTR Dragon movie story going viral on social media.
- ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ భారీ మూవీ.
- తండ్రీకొడుకుల ఎమోషనల్ యాక్షన్ డ్రామా.
- మునుపెన్నడూ చూడని ఊరమాస్ అవతార్
NTRNeel: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ‘డ్రాగన్(NTRNeel)’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ నేపధ్యంలోనే, ఈ సినిమా కథ గురించి ఒక న్యూస్ వైరల్ గా మారింది. ఇది తండ్రీకొడుకుల మధ్య సాగే ఒక ఎమోషనల్ పొలిటికల్ క్రైమ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోందట. గతంలో ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో కూడా తండ్రి లక్ష్యం కోసం కొడుకు పోరాడే కథాంశాన్ని చూశాం. ఇప్పుడు ప్రశాంత్ నీల్ తన మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో అదే తరహా తండ్రీకొడుకుల సెంటిమెంట్‌ను ఇంటర్నేషనల్ లెవల్లో మరింత రా అండ్ రస్టిక్ స్టైల్లో వెండితెరపై ఆవిష్కరించబోతున్నారట మేకర్స్.
Ashu reddy: రూ.9 కోట్ల మోసం.. అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. ఎన్నారై ధర్మేంద్రకు బెదిరింపులు
ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ మునుపెన్నడూ చూడని రీతిలో అత్యంత పవర్ఫుల్, మాస్ అవతార్‌లో కనిపించనున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఉండే డార్క్ థీమ్, భారీ ఎలివేషన్లు ఈ పొలిటికల్ డ్రామాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఒక రాజకీయ నేపధ్యం ఉన్న నేర సామ్రాజ్యంలో తండ్రికి జరిగిన అన్యాయానికి కొడుకు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేదే ఈ సినిమా ప్రధాన అంశంగా ఉండనుందట. ఎన్టీఆర్ నటనలోని విశ్వరూపాన్ని మరోసారి బయటకు తీసేలా నీల్ ఈ స్క్రిప్ట్‌ను పకడ్బందీగా సిద్ధం చేశారు.
ఈ సినిమా టైటిల్ ‘డ్రాగన్’ అని ప్రచారంలో ఉండటంతో ఇది యాక్షన్ ప్రియులకు ఫుల్ మీల్స్ లా ఉండనుందని అభిమానులు భావిస్తున్నారు. ‘నాన్నకు ప్రేమతో’ క్లాస్ అండ్ స్టైలిష్‌గా సాగితే, ఈ ప్రాజెక్ట్ మాత్రం ఊరమాస్ లెవల్లో ఉండబోతోందట. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్, ప్రశాంత్ నీల్ టేకింగ్ తోడైతే థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి మరి.
