Sanjay Leela Bhansali : సంజయ్ లీలా భన్సాలీ – రణబీర్ కపూర్ భారీ సినిమా.. రిలీజ్ డేట్ అనౌన్స్..

తాజాగా ఈ భారీ ప్రేమకథ సినిమా 'లవ్ అండ్ వార్' రిలీజ్ డేట్ ని ప్రకటించారు. (Sanjay Leela Bhansali)

  • Published on- April 17, 2026 / 09:58 PM IST

Sanjay Leela Bhansali

Sanjay Leela Bhansali : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ నెక్స్ట్ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ మెయిన్ లీడ్స్ లో సంజయ్ లీలా భన్సాలీ భారీ ప్రేమకథాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. లవ్ & వార్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

తాజాగా ఈ భారీ ప్రేమకథ సినిమా ‘లవ్ అండ్ వార్’ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. వచ్చే సంవత్సరం 2027 రిపబ్లిక్ డేకి కానుకగా ముందు వీకెండ్ జనవరి 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఎప్పట్లాగే భన్సాలీ మార్క్ అద్భుతమైన విజువల్స్, భారీ సెట్టింగ్స్, ఎమోషన్స్ తో ఈ సినిమా రూపొందుతోంది. లవ్ & వార్ సినిమా కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. మారి భన్సాలీ మరోసారి తన మార్క్ లవ్ స్టోరీతో ఎలా మెప్పిస్తారో చూడాలి.

Also Read : Maria Juliana : విజయ్ కి ఓటేయొద్దు.. ధర్నా చేస్తున్న బిగ్ బాస్ భామ..

ఇక రణబీర్ ఈ సంవత్సరం దీపావళికి రామాయణ సినిమాతో రాముడిగా కనిపించబోతున్నాడు. అది అవ్వగానే లవ్ & వార్ తో రాబోతున్నాడు.