Rakasa OTT: ఓటీటీలో లేటెస్ట్ బ్లాక్ బస్టర్.. ‘రాకాస’ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Rakasa OTT Date: ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సంతోష్ శోభన్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ రాకాస(Rakasa OTT).
- V Santhosh Kumar
- Updated on- April 27, 2026 / 11:37 AM IST
santosh shoban rakasa movie streaming release date on netflix
- మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
- ఐదు భాషల్లో రాబోతున్న ‘రాకాస’
- నిహారిక నిర్మించిన హారర్ కామెడీ
Rakasa OTT: యంగ్ హీరో సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించిన ఫాంటసీ హారర్ కామెడీ చిత్రం ‘రాకాస (Rakasa OTT)’ ఇప్పుడు డిజిటల్ సందడికి సిద్ధమైంది. ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఈ చిత్రాన్ని మెగా డాటర్ నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత ప్యాషన్‌తో నిర్మించారు. దర్శకురాలు మానస శర్మ హారర్ ఎలిమెంట్స్‌కు స్వచ్ఛమైన కామెడీని జోడించి మలిచిన విధానం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.
* రీ-షూట్ లో ఎన్టీఆర్ ‘డ్రాగన్’.. మరోసారి ఎన్టీఆర్ మేకోవర్.. అసలేం ప్లాన్ చేస్తున్నావ్ నీల్
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం, మే 1, 2026 నుండి ‘రాకాస’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రాబోతోంది. వేసవి సెలవుల్లో కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా నవ్వుకోవడానికి ఇదొక చక్కని ఎంటర్‌టైనర్‌గా నిలవనుంది. థియేటర్లలో ఈ ఫన్ రైడ్‌ను మిస్ అయిన వారికి ఇది ఒక మంచి అవకాశం.
ముఖ్యంగా వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీనుల కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. వారి నటన ప్రేక్షకులను గంటన్నర పాటు నాన్‌స్టాప్‌గా నవ్వించడంలో సఫలమైంది. హీరో సంగీత్ శోభన్ తన నేచురల్ యాక్టింగ్‌తో మరోసారి యూత్‌ను ఆకట్టుకోగా, నయన్ సారిక తన నటనతో మెప్పించింది. హారర్ చిత్రాలను ఇష్టపడే వారితో పాటు ప్యూర్ కామెడీని కోరుకునే వారికి ‘రాకాస’ మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో విందు అందించడానికి సిద్ధంగా ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రోమో విడుదల కానుంది.
