×
Ad

Santosh Soban : ఎక్కడున్నావమ్మా..? స్కూల్ గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్న సంతోష్ శోభన్.. పేరు చెప్పి..

ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ఓ ఇంటర్వ్యూలో సంతోష్ శోభన్ తన స్కూల్ లవ్ స్టోరీ గురించి చెప్పాడు. (Santosh Soban)

Santosh Soban

Santosh Soban : చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు సంతోష్ శోభన్. కాకపోతే సంతోష్ హిట్ కొట్టి చాలా కాలం అయింది. సంతోష్ శోభన్ ఈ వాలెంటైన్స్ డేకి కపుల్ ఫ్రెండ్లీ అనే సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు సంతోష్.(Santosh Soban)

ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ఓ ఇంటర్వ్యూలో సంతోష్ శోభన్ తన స్కూల్ లవ్ స్టోరీ గురించి చెప్పాడు.

Also See : Vishwak Sen : చంద్రన్న కోసం బండ్లన్న చేస్తున్న పాదయాత్రలో విశ్వక్ సేన్.. ఫొటోలు..

సంతోష్ శోభన్ తన లవ్ స్టోరీ గురించి చెప్తూ.. కైవల్లి అని స్కూల్ లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందో ఏంటో. ఇప్పుడన్నా ఆమె కనెక్ట్ అయి ఫీల్ అవుతుందేమో. ఆమె నాకు చాలా ఇష్టం కానీ వర్కౌట్ అవ్వలేదు. ఒకే అపార్ట్మెంట్ లో ఉండటం వల్ల ఇంకా దగ్గరయ్యాం. స్కూల్ కి ఇద్దరం ఆటోలో కలిసి వెళ్లి కలిసి వచ్చేవాళ్ళం. తనతో అలా ఎక్కువ టైం గడిపేవాడిని. ఇప్పుడు ఎక్కడుందో తెలీదు అని అన్నారు.

దీంతో సంతోష్ శోభన్ స్కూల్ లవ్ స్టోరీ వైరల్ గా మారింది. సంతోష్ ఇప్పటికైనా తనకి  కనెక్ట్ అయి ఫీల్ అవుతుందేమో అనడంతో ఇంకా ఆ అమ్మాయి కోసమే వెయిట్ చేస్తున్నాడు అంటూ ఈ ఇంటర్వ్యూని వైరల్ చేస్తున్నారు. మరి ఆ అమ్మాయి ఎవరో ఈ ఇంటర్వ్యూ చూసి సంతోష్ ని కాంటాక్ట్ అవుతుందేమో చూడాలి.

Also Read : Sudharshan : గోదావరిలో మునిగిపోయిన సుదర్శన్.. చనిపోయాడని ఫోన్స్ కూడా చేసేసారు.. కట్ చేస్తే..

సంతోష్ శోభన్ మానస వారణాసి కపుల్ ఫ్రెండ్లీ ఫుల్ ఇంటర్వ్యూ ఇక్కడ చూసేయండి..