×
Ad

Santosh Sobhan : పాపం.. పవన్ కళ్యాణ్ కోసం వెళ్లి.. పోలీస్ దెబ్బలు తిన్న హీరో..

ఓ సందర్భంలో హీరో సంతోష్ శోభన్ కూడా దెబ్బలు తిన్నాడట.(Santosh Sobhan)

Santosh Sobhan

Santosh Sobhan : పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే. ఆయన ఫ్యాన్స్ ని అదుపు చేయడానికి ఒక్కోసారి పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి ఓ సందర్భంలో హీరో సంతోష్ శోభన్ కూడా దెబ్బలు తిన్నాడట.(Santosh Sobhan)

హీరో సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ అనే సినిమాతో వాలెంటన్స్ డేకి రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంతోష్ ఈ విషయం గురించి తెలిపాడు.

Also Read : Anchor Sravanthi : శివాజీ కామెంట్స్ పై యాంకర్ స్రవంతి.. ఆయన అలా మాట్లాడారని..

సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. ఆయన్ని ఎక్కువగా చూడలేదు నేను. అత్తారింటికి దారేది సినిమా షూటింగ్ సమయంలో ఆయన్ని చూడటానికి వెళ్ళాను. అప్పటికే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ చాలా ఎక్కువ. ఆ షూటింగ్ అవుట్ డోర్ లో జరగడంతో చాలా మంది ఫ్యాన్స్ ఆ షూటింగ్ చూడటానికి వచ్చారు.

షూటింగ్ జరిగే ప్లేస్ కి భారీగా ఫ్యాన్స్ రావడంతో పరిస్థితిని అదుపుచేయడానికి పోలీసులు ప్రయత్నిచారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. దీంతో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. అప్పుడు కొంతమంది ఫ్యాన్స్ తో పాటు నాకు కూడా లాఠీ దెబ్బలు పడ్డాయి అని తెలిపాడు.

Also Read : Rajasaab : ఒరేయ్.. ఇదేందయ్యా.. హీరోయిన్ కి కూడా డూప్ వాడారా? రాజాసాబ్ పై మళ్ళీ ట్రోల్స్..