Euphoria OTT: ఓటీటీలో కొత్త సినిమా ‘యుఫోరియా’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సారా అర్జున్ లేటెస్ట్ మూవీ యుఫోరియా(Euphoria OTT).

Sara arjun euphoria movie now streaming on Etv win

Euphoria OTT: టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సోషల్ డ్రామా థ్రిల్లర్ ‘యుఫోరియా(Euphoria OTT)’. ధురంధర్ భామ సారా అర్జున్, భూమిక ప్రధాన పాత్రలు చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన బోల్డ్ అండ్ ఎమోషనల్ డ్రామా సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్సుడ్ టాక్ వచ్చింది.

Nazriya Nazim: నజ్రియా నాజిమ్ గ్లామర్ అటాక్.. పొట్టి స్కర్ట్‌లో మలయాళ కుట్టి హాట్ లుక్స్

కానీ, మేకర్స్ అనుకున్నంత సక్సెస్ అవలేదు ఈ సినిమా. దీంతో, ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది. నేటి నుంచే అంటే ఏప్రిల్ 2, 2026 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. దీంతో, ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం చూస్తున్న ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి థియేటర్స్ లో ప్లాప్ గా నిలిచిన ఈ సినిమాకు ఓటీటీ ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.

ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఐఏఎస్ ఆస్పిరెంట్ కావాలనుకునే చైత్ర (సారా అర్జున్) అనే యువతి, ఒక పార్టీలో ధనిక యువకుల బారిన పడి ఎదుర్కొన్న అన్యాయం, ఆపై ఆమె చేసిన పోరాటమే ఈ సినిమా కథ. హైదరాబాద్ జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ వంటి నిజ జీవిత ఘటనలను ప్రేరణగా తీసుకున్న గుణశేఖర్, సమాజంలోని వికృత పోకడలను ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపించారు. సారా అర్జున్ తన పరిణతి చెందిన నటనతో ఆకట్టుకోగా, భూమిక చావ్లా ఒక పవర్‌ఫుల్ పాత్రలో మెరిశారు.