Sarkar Bai : తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో మరో సినిమా.. సర్కారు బాయి..

ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసారు. (Sarkar Bai)

  • Published on- June 26, 2026 / 03:34 PM IST

Sarkar Bai

Sarkar Bai : శ్రీరామ్ నిమ్మల, వర్షిక జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘సర్కారు బాయి’. డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి నిర్మాణంలో లారా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తెలంగాణలో ఒకప్పుడు జరిగిన నీటి సమస్యలు, కుల వివక్ష ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసారు.

తాజాగా ఈ సినిమా హీరో శ్రీరామ్ నిమ్మల పుట్టిన రోజు సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో తెలంగాణ పల్లె యువకుడిగా శ్రీరామ్ నిమ్మల కనిపిస్తున్నారు. ప్రస్తుతం సర్కారు బాయి సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నెల 17వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.

Also Read : Varanasi : నాలుగు నెలల్లో వారణాసి.. పృథ్వీరాజ్ ఏమో అలా.. రాజమౌళి ఇలా.. నమ్మొచ్చా జక్కన్న..?

చేగుంట సమీపంలోని రెడ్డిపల్లి అనే ఊళ్ళో సర్కారు బాయి చిత్రీకరణ జరుపుతున్నారు. జూలై నెలాఖరు వరకు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ తెలుపనున్నారు.