Sarkaru Vaari Paata Completes 100 Days Run: సర్కారు వారి పాట @ 100 డేస్.. ఎక్కడో తెలుసా?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సర్కారు వారి పాట’ సమ్మర్ కానుకగా మే 12న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమా తాజాగా మరో అరుదైన ఘనతను సాధించింది. సర్కారు వారి పాట చిత్రం తాజాగా 100 రోజుల థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకుంది.
- Anil Aaleti
- Published On : August 19, 2022 / 04:13 PM IST
Sarkaru Vaari Paata Completes 100 Days
Sarkaru Vaari Paata Completes 100 Days Run: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సర్కారు వారి పాట’ సమ్మర్ కానుకగా మే 12న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. మహేష్ బాబు చాలా రోజుల తరువాత మాస్ లుక్‌లో దర్శనమివ్వడమే కాదు, మాస్ డైలాగులను ఆయన నోట విని అభిమానులు పండగ చేసుకున్నారు. ఇక దర్శకుడు పరశురామ్ పెట్ల ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దిన విధానం కూడా అభిమానులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మరో ఫీట్.. ఏకంగా 50!
ఈ సినిమాకు ప్రేక్షకులు పట్టం కట్టడంతో ఈ సినిమా కూడా మహేష్ బాబు కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తాజాగా మరో అరుదైన ఘనతను సాధించింది. సర్కారు వారి పాట చిత్రం తాజాగా 100 రోజుల థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఓటీటీలో కూడా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. దీంతో ఈ సినిమాను థియేటర్లలో ఇంకా ఎవరూ చూడరని అందరూ భావించారు. కానీ, 2 డైరెక్టర్ సెంటర్లలో సర్కారు వారి పాట ఏకంగా 100 రోజులు దిగ్విజయంగా ప్రదర్శించబడింది.
Sarkaru Vaari Paata: సర్‌ప్రైజ్ ఇస్తోన్న సర్కారు వారి పాట.. ఏమిటంటే?
వైజాగ్‌లోని గోపాలపట్నం, చిలకూరిపేట సెంటర్లలో ఈ మూవీ 100 రోజులు ఆడటంతో మహేష్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మహేష్ బాబు కెరీర్‌లో 100 రోజులు ఆడిన 18వ చిత్రంగా సర్కారు వారి పాట నిలవడం విశేషం. ఇక ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించగా, థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.
