Sarkaru Vaari Paata: యూఎస్‌లో దుమ్ములేపుతున్న సర్కారు వారి పాట!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్...
- Anil Aaleti
- Published On : May 11, 2022 / 03:45 PM IST
Sarkaru Vaari Paata Pre Sales Touches 650k Dollar Mark In Us
Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ‘సర్కారు వారి పాట’పై అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా కోసం ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మాస్ ట్రీట్.. మరికొన్ని గంటలే టైమ్!
ఇక ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన నటన ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాపై ఆసక్తి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ భారీ ఎత్తున నెలకొంది. ఇప్పటికే అక్కడి ఆడియెన్స్ మహేష్ మేనియాతో ఊగిపోతున్నారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఓవర్సీస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం అక్కడి ప్రేక్షకులు అప్పుడే పెద్ద ఎత్తున అడ్వాన్స్ టికెట్లు కొనుగోలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు.
Sarkaru Vaari Paata: సూపర్ కాన్ఫిడెన్స్‌తో సూపర్ స్టార్.. రికార్డ్సే టార్గెట్!
ఓవర్సీస్‌లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న స్టార్‌గా మహేష్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ చిత్రంతో మరోసారి తన స్టామినా ఏమిటో ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద చూపించేందుకు రెడీ అయ్యాడు. ఒక్క యూఎస్‌లోనే ఇప్పటివరకు సర్కారు వారి పాట అడ్వాన్స్ టికెట్స్ ప్రీసేల్స్ ఏకంగా 650K మిలియన్ డాలర్ల మార్క్‌ను క్రాస్ చేసిందంటే, మహేష్ క్రేజ్ అక్కడ ఏ రేంజ్‌లో ఉందో ఊహించుకోవచ్చు. ఈ సినిమా అడ్వాన్స్ టికెట్స్ ప్రీసేల్స్ రూపంలోనే 1 మిలియన్ డాలర్లు వసూలు చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఓవర్సీస్‌లో మంచి పట్టున్న మహేష్, అక్కడ సర్కారు వారి పాట చిత్రంతో ఎలాంటి మార్క్‌ను క్రియేట్ చేస్తాడో చూడాలి. ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
