KD Song: పాటలో అసభ్యత.. దర్శకుడు ఒత్తిడి వల్లే ఆ పదాలు రాశాను.. క్షమాపణలు చెప్పిన గీత రచయిత

తనపై వస్తున్న నెగిటీవ్ కామెంట్స్ కి క్షమాపణలు చెప్పున (KD Song)గీత రచయిత రఖీబ్ ఆలం.

Sarke Chunar song Lyricist Rakhib Alam Apologizes

KD Song; బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి నటించిన ‘సర్కే చునార్ తేరీ సర్కే’ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఈ పాటలోని అసభ్యకరమైన సాహిత్యం, నోరా డాన్స్ మూమెంట్స్ పై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా ఈ పాట రాసిన గీత రచయిత రఖీబ్ ఆలంపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. దీంతో, తాజాగా గీత రచయిత రఖీబ్ ఆలం వివరణ ఇచ్చారు.

Sravanthi Chokkarapu: రెడ్ డ్రెస్సులో హాట్ యాంకర్ స్రవంతి.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

రీసెంట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను ఈ పాట(KD Song)ను సొంతంగా రాయలేదు. కేవలం అనువదించాను. దర్శకుడు ప్రేమ్ మొదట కన్నడలో రాసిన సాహిత్యాన్ని యథాతథంగా హిందీలోకి మార్చాలని నాపై ఒత్తిడి తెచ్చాడు. అసభ్యకరమైన పదాలు ఉన్నందున నేను మొదట ఈ పాట రాయడానికి నిరాకరించాను. సెన్సార్ సమస్యలు వస్తాయని కూడా హెచ్చరించాను. కానీ, వారు వినకుండా ఒరిజినల్ వెర్షన్‌నే అనువదించమన్నారు.

నేను అదే చేశాను. పాటలోని కొన్ని లైన్లు ద్వంద్వార్థాన్ని ఇస్తున్నాయి. మద్యం సీసా గురించి వర్ణించినప్పటికీ, మధ్యలో వాడిన పదాలు అసభ్యంగా ఉన్నాయని, మంచి పాటలు రాసినప్పుడు రాని గుర్తింపు, ఇలాంటి వివాదాల వల్ల వస్తోంది’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వివాదం ముదరడంతో నిర్మాతలు స్పందించి, అధికారిక హిందీ వెర్షన్‌ను యూట్యూబ్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, సోషల్ మీడియాలో ఈ పాటపై చర్చలు, విమర్శలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.