Golden Bhagyam : తెలుగు, తమిళ్ స్టార్ కమెడియన్స్ హీరోలుగా.. మల్టీస్టారర్ కామెడీ సినిమా.. గ్లింప్స్ రిలీజ్..
తెలుగు స్టార్ కమెడియన్ సత్య. తమిళ్ స్టార్ కమెడియన్ యోగిబాబు కలిసి తెలుగు - తమిళ్ కామెడీ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారు.(Golden Bhagyam)
- Saketh U
- Published on- September 29, 2026 / 12:14 PM IST
Golden Bhagyam
Golden Bhagyam : తెలుగు స్టార్ కమెడియన్ సత్య. తమిళ్ స్టార్ కమెడియన్ యోగిబాబు కలిసి తెలుగు – తమిళ్ కామెడీ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారు. రంగబలి సినిమా దర్శకుడు పవన్ బసంశెట్టి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసి గోల్డెన్ భాగ్యం అనే టైటిల్ ని ప్రకటించారు.
ఈ గ్లింప్స్ ఇటీవల కమల్ హాసన్, రజినీకాంత్ కాంబోలో రాబోతున్న నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా గ్లింప్స్ లా స్పూఫ్ చేసారు. ఈ గ్లింప్స్ లో మొదట తమిళ్, తెలుగు వాళ్ళు ఫుడ్ గురించి గొడవ పడినట్టు చూపించి సత్య, యోగిబాబు కలిసి రావడం, వాళ్ళ కామెడీతో సాగింది. కామెడీతో పాటు క్రైమ్ యాక్షన్ కూడా ఉండబోతుంది. దీంతో ఇద్దరు స్టార్ కమెడియన్స్ హీరోగా చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
Also Read : Emo Emo Idi : ‘ఏమో ఏమో ఇది’.. మంచు కొండల్లో రోషన్, ప్రీతీ ముకుందన్ రొమాంటిక్ సాంగ్..
మీరు కూడా గోల్డెన్ భాగ్యం టైటిల్ గ్లింప్స్ చూసేయండి..
