Rao Bahadur : స‌త్య‌దేవ్ ‘రావు బహదూర్’ ఏ ఓటీటీలో వ‌స్తుందో తెలుసా?

వెర్సటైల్ యాక్టర్ స‌త్య‌దేవ్ (Rao Bahadur ) న‌టించిన తాజా చిత్రం రావు బ‌హ‌దూర్‌.

Satyadev Rao bahadur a ott loki vasthundo telusa

Rao Bahadur : వెర్సటైల్ యాక్టర్ స‌త్య‌దేవ్ న‌టించిన తాజా చిత్రం రావు బ‌హ‌దూర్‌. వెంకటేష్ మ‌హా ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ చిత్రం నేడు (జూలై 3న‌) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి దాదాపు 40 కోట్ల బ‌డ్జెట్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఆర్ట్ డిపార్ట్మెంట్, మేకప్, కాస్ట్యూమ్స్ కే ఎక్కువగా ఖర్చు అయిందట. స‌త్య‌దేశ్ కెరీర్‌లోనే ఇదే భారీ బ‌డ్జెట్ చిత్రం.

Trisha : సినిమాలకు బ్రేక్… త్రిష పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా?

ఇదిలా ఉంటే.. ఈ చిత్రం ఏ ఓటీటీలోకి వ‌స్తుంద‌నే విష‌యం తెలిసిపోయింది. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధ‌ర‌కు సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. చిత్ర టైటిల్ కార్డు స‌మ‌యంలో డిజిట‌ల్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో వ‌స్తుంద‌ని చెప్పేశారు. అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమా విడుద‌లైన నెల‌రోజుల త‌రువాతనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంద‌ని అంటున్నారు.