Rao Bahadur OTT : ఓటీటీలోకి సత్యదేవ్ ‘రావు బహదూర్’.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే?
సత్యదేవ్ మెయిన్ లీడ్‌లో నటించిన రావు బహదూర్ (Rao Bahadur OTT) చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఫిక్సైంది.
- Thota Vamshi Kumar
- Updated on- July 28, 2026 / 01:05 PM IST
Satyadev Rao Bahadur OTT streaming date fix
Rao Bahadur OTT : సత్యదేవ్ మెయిన్ లీడ్‌లో నటించిన చిత్రం ‘రావు బహదూర్’. దీపా థామస్ కథానాయికగా నటించగా వెంకటేష్ మహా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర లు ఈ చిత్రాన్ని నిర్మించారు. సైకాలజికల్ థ్రిల్లర్ జానర్‌లో రూపుదిద్దుకున్న ఈ మూవీ జూలై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సత్యదేవ్ పాత్ర, ఆయన నటన విమర్శకులతో పాటు సినీ ప్రముఖులను సైతం మెప్పించింది. థియేటర్లలో అలరించిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ఇది. ఈ చిత్ర ఓటీటీ తేదీ ఫిక్సైంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ బాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
