Satyadev: సత్య దేవ్ కొత్త సినిమా ‘సమవర్తి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
టాలీవుడ్ హీరో సత్యదేవ్(Satyadev) కొత్త సినిమా సమవర్తి ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్.
- V Santhosh Kumar
- Published on- May 22, 2026 / 12:33 PM IST
satyadev samavarthi movie first look released
- సత్యదేవ్ నెక్స్ట్ మూవీ సమవర్తి.
- గొడ్డలితో ఊరమాస్ ఫస్ట్ లుక్.
- ఇదొక ఎకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్.
Satyadev: టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ తన కెరీర్‌లో మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త యాక్షన్ మోడ్‌లోకి మారిపోయారు. ఆయన హీరోగా నటిస్తున్న 16వ ప్రాజెక్ట్‌కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ తాజాగా బయటకు వచ్చింది. ఈ సినిమాకు ‘సమవర్తి’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ మేకర్స్ అదిరిపోయే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇటీవలే ‘ఆరంభం’ సినిమాతో ఆకట్టుకున్న అజయ్ నాగ్ వి. దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇండస్ట్రీలో ఇప్పటివరకు రాని ఒక విభిన్నమైన ‘ఎకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్’ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
Neha Shetty: ఓపుసొంపులతో వయ్యారంగా.. గ్లామర్ రచ్చ చేస్తున్న డీజే టిల్లు భామ నేహా శెట్టి.. ఫొటోలు
తాజాగా విడుదలైన పోస్టర్‌లో సత్యదేవ్ చుట్టూ గొడ్డలి పట్టుకుని, వైల్డ్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశారు. రుద్ర పిక్చర్స్, పంచభూత అఫీషియల్ బ్యానర్లపై జక్కిడి శివ, శశిధర్ సంయుక్తంగా ఈ హై-బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు. ఒక వైల్డ్ రైడ్‌లా సాగే ఈ కథలో సత్యదేవ్ క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుందని చిత్రబృందం నమ్మకంగా చెప్తోంది. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌లో దిలీష్ పోతన్, రాజీవ్ కనకాల, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
