Sai Dharam Tej : ఆసక్తి రేకెత్తిస్తున్న సాయి ధరమ్ తేజ్ టైటిల్ గ్లింప్స్ పోస్టర్..
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చివరగా ప్రేక్షకులను "రిపబ్లిక్" సినిమాతో పలకరించాడు. ఆ సినిమా విడుదల సమయంలో యాక్సిడెంట్ అవ్వడంతో, గత ఏడాది కాలంగా ఈ యువహీరో నుంచి ఎటువంటి సినిమా అప్డేట్ లేదు. ఇటీవలే బ్యాక్ టు షూట్ అంటూ వరుస సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే...
- gum 95921
- Published on- December 4, 2022 / 04:40 PM IST
SDT15 title glimpse announcement date released
Sai Dharam Tej : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చివరగా ప్రేక్షకులను “రిపబ్లిక్” సినిమాతో పలకరించాడు. ఆ సినిమా విడుదల సమయంలో యాక్సిడెంట్ అవ్వడంతో, గత ఏడాది కాలంగా ఈ యువహీరో నుంచి ఎటువంటి సినిమా అప్డేట్ లేదు. ఇటీవలే బ్యాక్ టు షూట్ అంటూ వరుస సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తన 15వ సినిమాను మొదలుపెట్టగా, శరవేగంగా చిత్రకరణ జరుపుకుంటుంది.
తాజాగా SDT15 నుంచి అదిరిపోయే అప్డేట్ ని ఇచ్చాడు. టైటిల్ గ్లింప్స్ డేట్ ని అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ ఆశక్తిని కలగజేస్తుంది. డిసెంబర్ 7వ తారీఖున సినిమా టైటిల్ ని ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని సాయి ధరమ్ ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ.. “ఒక కొత్త కథతో మీ ముందుకు రావడానికి మా టీమ్ చాలా హార్డ్ వర్క్ చేసింది. దాని రిజల్ట్ కూడా చాలా అద్భుతంగా వచ్చి, ఇక మీకు చూపించకుండా ఉండలేము” అంటూ చాలా కాన్ఫిడెంట్ గా ట్వీట్ చేశాడు.
కాగా ఈ సినిమాకు టాలీవుడ్ లెక్కల మాస్టర్ కథని అందిస్తున్నాడు. కొత్త దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గ్రామంలోని క్షుద్ర శక్తులు నేపథ్యంతో రాబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో భీమ్లా నాయక్ ఫేమ్ ‘సంయుక్త మీనన్’ హీరోయిన్ గా నటిస్తుంది. కాంతార సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
