Sai Dharam Tej : ఒక్కప్పుడు నా పేరు కూడా మీకు తెలియదు.. అతని పేరు ‘జయంత్’ గుర్తుపెట్టుకోండి.. అభిమానితో సాయి ధరమ్ తేజ్!

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ నుంచి కోలుకోవడంతో మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతున్నాడు. ఇటీవలే తన 15వ సినిమాను మొదలు పెట్టిన ఈ హీరో, ఇప్పుడు మరో సినిమాకు కొబ్బరికాయి కొట్టాడు. కాగా...

Sai Dharam Tej : ఒక్కప్పుడు నా పేరు కూడా మీకు తెలియదు.. అతని పేరు ‘జయంత్’ గుర్తుపెట్టుకోండి.. అభిమానితో సాయి ధరమ్ తేజ్!

Sai Dharam Tej reply to fan gone viral

Sai Dharam Tej : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ నుంచి కోలుకోవడంతో మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతున్నాడు. ఇటీవలే తన 15వ సినిమాను మొదలు పెట్టిన ఈ హీరో, ఇప్పుడు మరో సినిమాకు కొబ్బరికాయి కొట్టాడు. ఇవాళ పూజ కారిక్రమాలతో అధికారికంగా లంచ్ అయిన ఈ మూవీని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో ‘జయంత్ పనుగంటి’ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

Samantha : హిట్ వర్స్‌లో సమంత.. వైరల్ అవుతున్న అడివి శేషు ట్వీట్!

కాగా ‘చిత్రలహరి’ సినిమా తరువాత సరైన హిట్టు అందించకపోవడంతో అభిమానులు నిరాశతో ఉన్నారు. ఇప్పుడు కూడా తన రెండు కొత్త సినిమాలకు కొత్త దర్శకులతోనే వస్తుండడంతో, ఒక అభిమాని ట్విట్టర్ లో.. ‘కొంచెం పేరు తెలిసిన డైరెక్టర్ లతో పని చెయ్యి అన్నా’ అని ట్వీట్ చేశాడు. దానికి సాయి ధరమ్ బదులిస్తూ.. “ఒక్కప్పుడు నా పేరు కూడా మీకు తెలియదు, అతని పేరు జయంత్ గుర్తుపెట్టుకోండి” అంటూ బదులిచ్చాడు.

ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. మరి దర్శకుడు జయంత్, సాయి ధరమ్ తేజ్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడో? లేదో? చూడాలి. ప్రస్తుతం ఈ సుప్రీమ్ హీరో నటిస్తున్న SDT15 క్షుద్ర శక్తులు నేపథ్యంతో తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథని అందించగా, కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు.